Moviesఅఖండ ప్రి రిలీజ్ వేదిక‌గా బాల‌య్య నోట తార‌క్ మాట‌..ద‌ద్ద‌రిల్లిన స్టేజ్‌

అఖండ ప్రి రిలీజ్ వేదిక‌గా బాల‌య్య నోట తార‌క్ మాట‌..ద‌ద్ద‌రిల్లిన స్టేజ్‌

యువరత్న నందమూరి బాలకృష్ణ – ప్రగ్యా జైస్వాల్ జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అఖండ. శనివారం రాత్రి హైదరాబాద్లో జరిగిన అఖండ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ కు దర్శకధీరుడు రాజమౌళితో పాటు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్పెషల్ గెస్టులుగా హాజరయ్యారు. ఈ ఫంక్షన్‌కు వీరిద్దరే స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. ఇదిలా ఉంటే ఈ ప్రిరిలీజ్ ఫంక్షన్ వేదిక మీద‌ బాలయ్య నోట ఎన్టీఆర్ మాట వచ్చింది.

బాలకృష్ణకు ఎన్టీఆర్ కు మధ్య గ్యాప్ ఉందని రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఎప్పటికప్పుడు ఈ ప్రచారం ఉత్తిదే అని బాలయ్య, ఎన్టీఆర్ ఖండించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నా అవి ఆగ‌డం లేదు. రాజకీయంగా జరుగుతున్న పరిణామాలు కూడా వీరి మధ్య గ్యాప్ ఉందన్న ప్ర‌చారానికి మ‌రో కార‌ణం అవుతున్నాయి. అఖండ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో బాలయ్య మాట్లాడుతూ సినిమా గెలవాలని… అది తన సినిమానా… ఇతర హీరోల సినిమానా అన్నది కాదని ప్రతి ఒక్కరి సినిమా థియేటర్లలో బాగా ఆడాలని… ప్రేక్షకులు రావాలని కోరుకున్నారు.

ఈ క్రమంలోనే తర్వాత సోదరుడు అల్లు అర్జున్ పుష్ప‌, ఆ తర్వాత రామ్ చరణ్ – ఎన్టీఆర్ నటిస్తున్న ఆర్ ఆర్‌ ఆర్, ఆ తర్వాత చిరంజీవి గారు నటించిన ఆచార్య‌ సినిమాలు థియేటర్లలోకి వ‌స్తున్నాయ‌ని.. ఆ సినిమాలు అన్ని విజయం సాధించాలని తాను కోరుకుంటున్నానని బాల‌య్య‌ చెప్పారు.

ఏదేమైనా బాలయ్య నోట ఎన్టీఆర్ పేరు వచ్చిన వెంటనే శిల్పకళా వేదిక ఒక్కసారిగా ఈలలు, అరుపులతో దద్దరిల్లిపోయింది. అక్కడున్నవారంతా జై ఎన్టీఆర్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఏదేమైనా చాలా రోజుల తర్వాత బహిరంగంగా బాల‌య్య నోటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ పేరు రావడంతో నందమూరి అభిమానుల్లో ఆనందం ఒక్కసారిగా ఉప్పొంగింది.

Latest news