సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు చాలా మంది హీరోయిన్లు మూడు పదుల వయస్సు కాదు.. నాలుగు పదుల వయస్సుకు చేరువ అవుతున్నా కూడా ఇంకా పెళ్లి చేసుకోకుండా అలాగే ఉంటున్నారు. నయనతార, అనుష్క లాంటి వాళ్లే ఇందుకు ఉదాహరణ. అయితే కొందరు హీరోయిన్లు మాత్రం చిన్న వయస్సులోనే పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయారు. కొందరు చిన్న వయస్సులో పెళ్లి చేసుకున్నా కూడా సినిమాలు చేస్తూ వచ్చారు. పెళ్లయ్యాక కూడా స్టార్ హీరోయిన్లుగా వెలిగిన వారు కూడా ఉన్నారు. అయితే ఎవరెవరు చిన్న వయస్సులోనే పెళ్లి చేసుకున్నారో ? ఆ హీరోయిన్ల గురించి తెలుసుకుందాం.
షాలినీ :
చిన్న వయసులోనే సినీ ఇండస్ట్రీలోకి బాలనటిగా అడుగుపెట్టిన షాలినీ సఖీ సినిమాతో హీరోయిన్ అయ్యింది. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆమెకు మంచి మార్కులు వేసింది. కేవలం 21 సంవత్సరాల వయస్సులోనే తమిళ హీరో అజిత్‌ను ప్రేమ వివాహం చేసుకుని.. ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది.
జూనియర్ శ్రీదేవి:
ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు పొందిన శ్రీదేవి చిన్న వయస్సులోనే హీరోయిన్ అయ్యి ఎక్కువ సినిమాలు చేసింది. ఆమె ఎవరో కాదు అలనాటి మేటి నటి మంజుల కుమార్తె. తెలుగులో ఈశ్వర్ సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైంది. 23 ఏళ్లకే రాహుల్ అనే వ్యక్తిని పెళ్లాడింది.
రాధిక ఆప్టే:
ప్రముఖ బాలీవుడ్ హాట్ హీరోయిన్ రాధిక ఆఫ్టే కూడా తెలుగు ప్రేక్షకులకు పలు సినిమాలతో పరిచయం. ఆమె 23 సంవత్సరాలకే లండన్‌కు చెందిన బెనెడిక్ట్ టేలర్‌ను పెళ్లి చేసుకుంది.
దివ్యభారతి:
దివ్యభారతి 1990వ దశకంలో యావత్ భారతదేశాన్ని ఓ ఊపు ఊపేసింది. బొబ్బిలిరాజా సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె 18 ఏళ్లకే బాలీవుడ్ నిర్మాత సాజిద్ నడియడ్‌వాలాను పెళ్లి చేసుకుంది.
జెనీలియా:
తెలుగు ప్రేక్షకుల మదిలో హాసినిగా ముద్ర వేసుకున్న జెనీలియా బొమ్మరిల్లు, ఢీ వంటి సినిమాలతో అదరగొట్టింది. ఆమె 24 ఏళ్లకే మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ కొడుకు రితేష్ ను వివాహం చేసుకుంది.
అతిథి రావు హైదరి:
హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగిన అతిథి రావు హైదరి 21 సంవత్సరాల వయసులో సత్య దీప్ మిశ్రాను పెళ్లాడింది. అయితే ఆ తర్వాత అతడికి దూరమైంది.