Moviesస‌హ‌జీవ‌నాలు, బ్రేక‌ప్‌లు చేసుకున్న టాలీవుడ్ జంట‌లు వీళ్లే...!

స‌హ‌జీవ‌నాలు, బ్రేక‌ప్‌లు చేసుకున్న టాలీవుడ్ జంట‌లు వీళ్లే…!

సినిమా పరిశ్రమ అంటేనే ఓ రంగుల ప్రపంచం. ముందు కనిపించే రంగుల వెనుక ఎన్నో క‌నిపించ‌ని రంగులు ఈ మాయా ప్రపంచంలో ఉంటాయి. సినిమా ప్రపంచంలో అవకాశాల కోసం ఇప్పుడు ఎవరు ? ఎవ‌రితో సన్నిహితంగా ఉంటారు ? ఎవరు ఎప్పుడు ఎవ‌రికికి షాక్ ఇస్తారో ? తెలియదు. ఇండస్ట్రీలో హీరో – హీరోయిన్ల మధ్య ఎఫైర్లు ఇక్క‌డ చాలా కామ‌న్‌. అలాగే హీరోయిన్లు దర్శక నిర్మాతల మధ్య లవ్ ఎఫైర్లు కూడా మామూలే.

ఇక్కడ నిజమైన ప్రేమలకు అవకాశాలు తక్కువ. వారి వ్యక్తిగత అవకాశాల కోసమే చాలామంది ప్రేమలో ఉన్న‌ట్టు నటిస్తూ ఉంటారు అని చెబుతుంటారు. ఇక ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు.. బాయ్ ఫ్రెండ్స్ తో సహజీవనం చేసి బ్రేకప్ చెప్పుకుంటూ ఉంటారు. అలాగే కొందరు హీరో, హీరోయిన్లకు ఎంగేజ్మెంట్ అయ్యాక కూడా క్యాన్సిల్ అయిన సందర్భాలు ఉన్నాయి. మరి కొందరు పెళ్లి వరకు వచ్చి విడిపోయారు. అలాంటి గురించి తెలుసుకుందాం.

సౌత్ ఇండియా సూప‌ర్ స్టార్ ర‌మ్య‌కృష్ణ ద‌క్షిణాది సినీ ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ స‌ప‌రేట్ గుర్తింపు తెచ్చుకుంది. ఆమె ఇప్పుడు స్టార్ హీరోల‌తో స‌మాన‌మైన ఇమేజ్‌తో పాటు రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేస్తోంది. ఇక న‌య‌న‌తార ఒక‌రు కాదు.. ఇద్ద‌రు కాదు ముగ్గురితో ప్రేమాయ‌ణాలు న‌డిపింది. ముందుగా ఆమె శింబుతో ప్రేమాయ‌ణం న‌డిపింది. ఆ త‌ర్వాత ప్ర‌భుదేవాతో పెళ్లి వ‌ర‌కు వెళ్లింది. ఇక ఇప్పుడు ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివ‌న్‌తో ప్రేమాయ‌ణంలో మునిగి తేలుతోంది.

ఇక తెలుగు అమ్మాయి అంజ‌లి జ‌ర్నీ సినిమాలో త‌న‌తో క‌లిసి న‌టించిన జైతో ప్రేమాయ‌ణం న‌డిపింది. ఇద్ద‌రు స‌హ‌జీవ‌నం కూడా చేశారు. ఇంత‌లోనే వీరు బ్రేక‌ప్ చెప్పేసుకున్నారు. జై న‌న్ను మోసం చేశాడంటూ అంజ‌లి ఓపెన్‌గానే చెప్పేసింది. చెన్నై చిన్న‌ది త్రిష సైతం సిద్ధార్థ్‌తో ముందుగా ప్రేమ‌లో ప‌డింది. ఆ త‌ర్వాత పారిశ్రామిక వేత్త వ‌రున్ మ‌ణియ‌న్‌తో ప్రేమ‌లో ప‌డి ఎంగేజ్‌మెంట్ చేసుకుంది.

ఎంగేజ్‌మెంట్ జ‌రిగాక కూడా వీరి పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. ఇందుకు కార‌ణం పెళ్లి త‌ర్వాత త్రిష సినిమాల్లో న‌టించేందుకు వ‌రుణ్ ఒప్పుకోక‌పోవ‌డ‌మే అని అంటారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news