తెలుగు సినిమా ఇండస్ట్రీలో దివంగత దివ్యభారతి చేసిన సినిమాలు చాలా తక్కువే. అయితే ఆమె తక్కువ సినిమాలతోనే ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంది. చాలా చిన్న వయసులోనే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన దివ్యభారతి… తెలుగు లో బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టింది. చిరంజీవితో రౌడీ అల్లుడు – మోహన్ బాబుతో అసెంబ్లీ రౌడీ – వెంకటేష్‌తో బొబ్బిలి రాజా – బాలకృష్ణతో ధర్మచక్రం లాంటి సినిమాల్లో దివ్యభారతి నటించింది.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాగార్జునతో మినహా ఆమె అందరితోనూ కలిసి నటించారు. అయితే అనుకోకుండా నాగ్‌తో మాత్రం ఆమె కాంబినేషన్ మిస్ అయ్యింది. కేవలం 19 సంవత్సరాల వయస్సులోనే ఆమె 20 సినిమాల్లో నటించారు. ఆమె చేసిన సినిమాల్లో ఎక్కువ శాతం సూపర్ హిట్లే. అసెంబ్లీరౌడీ సినిమాలో ఆమె నటనకు తెలుగు ప్రేక్షకులు ఎంతలా ఫిదా అయిపోయారో తెలిసిందే.
ఇదిలా ఉంటే దివ్యభారతికి చింతామణి పాత్రలో నటించాలన్న కోరిక ఎంతో ఉండేదట. ఈ క్రమంలోనే 1992లో ఆమె ప్రధాన పాత్రలో చింతామణి టైటిల్‌తో సినిమా ప్రారంభమైంది. దర్శకరత్న దాసరి నారాయణరావు ఈ సినిమాకు దర్శకుడు. అయితే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాకుండానే దివ్యభారతి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది.
ఆమె చనిపోయే టైంకు ఆమె రోజుకు రు. లక్ష రూపాయలు రెమ్యునరేషన్ డిమాండ్ చేసేవారట. దివ్యభారతికి దేశవ్యాప్త్ంగా ఉన్న క్రేజ్ దృష్ట్యా నిర్మాతలు కూడా ఆమె అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చేవారట. ఆమె చనిపోయే టైంకు తొలిముద్దు సినిమా షూటింగ్ సగంలో ఉంది. అప్పుడు రంభతో ఆ పార్ట్‌ను పూర్తి చేసి రిలీజ్ చేశారు.