Moviesఎన్టీఆర్ - మ‌హేష్‌ ఎంఈకేలో ప‌వ‌న్ కూడా... వీడియో కాల్ ఫ్రెండ్‌గా..!

ఎన్టీఆర్ – మ‌హేష్‌ ఎంఈకేలో ప‌వ‌న్ కూడా… వీడియో కాల్ ఫ్రెండ్‌గా..!

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా జెమినీ టీవీలో ఎవ‌రు మీలో కోటీశ్వ‌రుడు షో టెలీకాస్ట్ అవుతోంది. ఈ సీజ‌న్‌లో ఈ షో దాదాపు ముగింపు ద‌శ‌కు వ‌చ్చేసింది. ఈ షోకు తార‌క్ త‌న వంతుగా క్రేజ్ తెచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నారు. అస‌లు ఎవ‌రు మీలో కోటీశ్వ‌రుడు కొన్ని సీజ‌న్లు డిజాస్ట‌ర్ అయ్యాయి. అయితే ఇప్పుడు తార‌క్ మాత్రం క‌నీస టీఆర్పీ రేటింగ్ ఉండేలా చూసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ సీజ‌న్లో కొంద‌రు సెల‌బ్రిటీల‌ను కూడా తార‌క్ తీసుకువ‌చ్చారు.

ఈ సారి సీజ‌న్‌కు అదిరిపోయే ముగింపు ఇచ్చేలా సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబును ఓ స్పెష‌ల్ గెస్ట్‌గా ఓ ఎపిసోడ్‌కు తీసుకువ‌చ్చారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ ఎపిసోడ్ త్వ‌ర‌లోనే టెలీకాస్ట్ కానుంది. ఇందుకు సంబంధించి ప్రోమో కూడా వ‌చ్చింది. మ‌హేష్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన వెంట‌నే తార‌క్ అన్నా అంటూ కౌగింలించుకుంటాడు. తార‌క్ కూడా ట‌ఫ్ క్వ‌శ్చ‌న్స్‌తో మ‌హేష్‌ను ఓ ఆటాడుకుంటాడ‌ని ప్రోమోలో చూస్తూనే అర్థ‌మైంది.

ఇక ఈ ఎపిసోడ్‌లోనే అదిరిపోయే ట్విస్ట్ ఉంటుంద‌ని తెలుస్తోంది. ఎన్టీఆర్‌తో గేమ్ ఆడుతున్న స‌మ‌యంలోనే ఓ ప్ర‌శ్న‌కు మ‌హేష్‌బాబు వీడియో కాల్ ఫ్రెండ్ ఆప్ష‌న్ తీసుకుంటాడ‌. ఈ ఆప్ష‌న్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ఎంపిక చేసుకుని ప‌వ‌న్ సాయం కోర‌తాడ‌ని తెలుస్తోంది. అదే జ‌రిగితే ఎపిసోడ్లో అంత‌కు మించిన ట్విస్ట్ మ‌రొక‌టి ఉండ‌దు. ఏదేమైనా బుల్లితెర‌పై ఒకే ఎపిసోడ్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మ‌హేష్‌బాబు, ఎన్టీఆర్‌ను చూడ‌డం అంటే అంత‌కు మించి ఆనందం మ‌రొక‌టి ఉండ‌దు.

ఇక ఈ ఎపిసోడ్ అదిరిపోయ‌యే టీఆర్పీల‌ను సొంతం చేసుకుంటుంద‌ని కూడా బుల్లితెర వ‌ర్గాల్లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఏదేమైనా ఎన్టీఆర్ – మ‌హేష్ ఎపిసోడ్ బ‌ద్ద‌లు కొట్టే రికార్డుల కోస‌మే ఇప్పుడు అంద‌రూ వెయిట్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news