టాలీవుడ్ సినీయర్ హీరో విక్టరీ వెంకటేష్ వివాదాలకు దూరంగా తన పని తాను చేసుకుంటూ వెళుతుంటారు. ఇటీవల వెంకటేష్ నటించిన నారప్ప సినిమా ఓటీటీ రిలీజ్ అయ్యి హిట్ కొట్టింది. ఈ క్రమంలోనే వెంకీ నటించిన మరో సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. దృశ్యం 2 సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ కు రెడీ అవుతోంది.
ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ – యంగ్ హీరో వరుణ్ తేజ్ కలిసి నటించిన ఎఫ్ 3 సినిమా సమ్మర్లో థియేటర్లలో సందడి చేయనుంది. వెంకటేష్ సినిమా జీవితాన్ని… ఫ్యామిలీ జీవితాన్ని వేరుగా చూస్తారు. వెంకటేష్ ఫ్యామిలీ ఎప్పుడూ పబ్లిక్ లోకి రాదు. వెంకటేష్‌కు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వెంకటేష్ భార్య పేరు నీరజా దగ్గుబాటి. ఆమె బీజేపీ నేత, ఏపీ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ కు స్వయానా మేనకోడలు కావటం విశేషం.
ఇదిలా ఉంటే పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, టీడీపీ కీలక నేత పెండ్యాల అచ్చిబాబు వెంకటేష్ తోడల్లుడు. అచ్చి బాబు భార్య, వెంకటేష్ భార్య నీరజ ఇద్దరు అక్కాచెల్లెళ్లు కావడం విశేషం. పెండ్యాల అచ్చిబాబు కొవ్వూరు జమిందారి కుటుంబానికి చెందిన వారు. ఆ కుటుంబం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కొవ్వూరు నియోజకవర్గంతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం – పోలవరం రాజకీయాలను శాసిస్తున్న ఉండేది.
అచ్చిబాబు సోదరుడు పెండ్యాల వెంకట కృష్ణారావు కొవ్వూరు నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వెంకటేష్ గోదావరి జిల్లాల్లో తన సినిమాల షూటింగ్ జరిగినప్పుడు అచ్చిబాబుకు చెందిన ఆంధ్ర సుగర్స్ గెస్ట్ హౌస్ లోనే బస చేసేవారు.