శ్రీదేవి తెలుగు – తమిళ భాషల్లో అప్పట్లో లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. శ్రీదేవి సినిమా రిలీజవుతుందంటే హీరోలతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆమె కోసం క్యూ కట్టేవారు. సౌత్ ఇండియన్ అయిన శ్రీదేవి ఆ తర్వాత బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి భారతదేశం గర్వించే అతిలోకసుందరి అయిపోయింది. ఆమె తమిళనాడులోని శివకాశిలో జన్మించారు. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన శ్రీదేవి బంధువులు ఏపీలోని తిరుపతిలో ఉన్నారు.
శ్రీదేవి ముందుగా కందన్ కరుణై అనే తమిళ సినిమాతో కెరీర్ మొదలు పెట్టింది. తొలినాళ్ళలో తమిళ, మళయాళం సినిమాలు ఎక్కువగా చేశారు. కమల్ హాసన్ – శ్రీదేవి కాంబినేషన్ లో ఎన్నో హిట్ సినిమాలు వచ్చాయి. ఈ కాంబినేషన్‌కు అప్పట్లో ఎంతో క్రేజ్ ఉంది. వసంత కోకిల – ఆకలిరాజ్యం – ఒక రాధ ఇద్దరు కృష్ణులు సినిమాలు ఈ జంటకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. విచిత్రం ఏమిటంటే శ్రీదేవి నార్త్‌కు వెళ్ళిపోయాక బాలీవుడ్లో కూడా వీరు కలిసి నటించారు.
శ్రీదేవి – కమల్ హాసన్ ఎంతో సన్నిహితంగా ఉండడంతో శ్రీదేవి తల్లి కమలహాసన్ తో శ్రీదేవిని పెళ్లి చేసుకోవాలని కోరారు. అయితే కమల్ మాత్రం శ్రీదేవి తల్లి చేసిన ప్రపోజల్ కు నో చెప్పేశాడట. శ్రీదేవిని సిస్టర్ అని తాను భావిస్తున్నానని… అందుకే ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదని చెప్పారట.
సినిమాల్లో తాము హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నా.. బయట మాత్రం తమది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ బంధమని చెప్పేశారట. ఇక శ్రీదేవి అంటే ఎంతో గౌరవం అని కూడా కమల్ ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ఇక దేశం గర్వించే అతిలోక సుందరిగా ఉన్న శ్రీదేవి 2018 ఫిబ్రవరి 24న దుబాయ్‌లో అనుమానాస్పదంగా మృతి చెందిన సంగతి తెలిసిందే.