యువరత్న నందమూరి బాలకృష్ణ 40 సంవత్సరాలుగా తెలుగు సినిమా రంగంలో కొనసాగుతున్నారు. బాలయ్య యుక్త వయస్సులో ఉన్నప్పుడే తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని సినిమాల్లోకి వచ్చారు. అప్పట్లోనే ఎన్టీఆర్ దర్శకత్వంలో ఎన్నో పౌరాణిక సినిమాల్లో బాలయ్య నటించారు. ఎన్టీఆర్ తరం జనరేషన్ హీరోల తర్వాత తెలుగు సినిమా చరిత్రలో బాలకృష్ణ రేంజ్లో పౌరాణిక సినిమాల్లో నటించగల హీరో ఏ ఒక్కరు లేరనే చెప్పాలి.
బాలయ్యతో తాము పౌరాణికాల్లో పోటీ పడతామని క్యారెక్టర్ లు వేసిన ఎంతో మంది హీరోలు ఆ స్థాయిలో సక్సెస్ కాలేదు. బాలయ్య కెరీర్ లో ఎన్నో ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి… ఎన్నో హిట్ సినిమాలు ఉన్నాయి. ఇండస్ట్రీ హిట్లు కూడా ఉన్నాయి. ఎన్ని సినిమాలు ఉన్నా కూడా బాలయ్య కెరీర్ లో వందో సినిమాగా వచ్చిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతో ఓ మెమొరబుల్ హిట్‌ను అటు బాలయ్యకు… ఇటు నందమూరి అభిమానులకు అందించాడు దర్శకుడు క్రిష్.
బాలయ్య వందో సినిమాను ఏ కథతో తెరకెక్కించాలని అనుకున్నప్పుడు చాలా చర్చలు జరిగాయి. బాలయ్య సైతం తన మెమరబుల్ సినిమా కోసం ఏ కథ ఎంచుకోవాలనే విషయంలో చాలా రోజులు వెయిట్ చేశారు. అయితే ఆంధ్రదేశాన్ని పాలించిన గౌతమీపుత్ర శాతకర్ణి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన శాతకర్ణి సినిమా తెలుగు ఇండస్ట్రీ చరిత్రలో నిలిచిపోవడంతో పాటు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
బాలయ్య పౌరాణికం – సాంఘికం – భక్తిరస చిత్రాలతో పాటు చారిత్రక సినిమాల్లోనూ నటించగలరు అని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. ఈ సినిమాకు పోటీగా సంక్రాంతికే ఒకరోజు ముందుగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 సినిమా వచ్చింది. ఆ సినిమా కూడా చిరు 150వ సినిమాగా తెరకెక్కింది. ఆ సినిమా హిట్ అయినా కూడా ప్రేక్షకులు, విమర్శకులు శాతకర్ణికే ఓటు వేశారు.
అప్పటికే తమిళంలో హిట్ అయిన విజయ్ కత్తి సినిమా ఇక్కడ చిరంజీవి ఖైదీ నెంబర్ 150గా రీమిక్స్ చేశారు. బాలయ్య మాత్రం చారిత్రాత్మక నేపథ్యం ఉన్న కథను తీసుకుని బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తన కెరీర్లో ఓ మంచి జ్ఞాపకాన్ని పదిలపరచుకున్నారు.