టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో అదే ఇమేజ్‌తో కొనసాగుతున్నారు. నాగార్జున కెరీర్‌ను టర్న్ చేసిన సినిమా శివ. ఆ సినిమాతో నాగార్జునకు యూత్‌లోనూ, అమ్మాయిల్లోనూ మంచి పాపులారిటీ వచ్చింది. ఆ తర్వాత నిన్నే పెళ్లాడతా సినిమాతో మరోసారి అమ్మాయిల కలల రొమాంటిక్ హీరో అయిపోయాడు. ఇక 2002లో వచ్చిన మన్మథుడు సినిమాతో నాగ్ ఎప్పటకి తెలుగు ప్రేక్షకుల మదిలో మన్మథుడు అయిపోయాడు. ఇలా నాగార్జున కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు వచ్చాయి. వాటిన్నింటికంటే కూడా నాగార్జునను స్టార్ హీరోను చేసింది మాత్రం శివ సినిమాయే.
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తొలి సినిమా అయిన శివ సినిమా నాగార్జునకు జీవితాంతం గుర్తు పెట్టుకునేలా ఎన్నో మధురానుభూతులు మిగిల్చింది. ఈ సినిమా హీరోయిన్ అమలనే తర్వాత తన జీవిత భాగస్వామిని చేసుకున్నాడు. అసలు శివ సినిమా వచ్చాక చాలా మంది కాలేజ్ యాజమాన్యాలు ఏఎన్నార్ దగ్గరకు వెళ్లి మీ పిల్లాడితో ఇలాంటి సినిమాలు చేయిస్తే మా కాలేజ్‌ల్లో కుర్రాళ్లను ఎలా ? కంట్రోల్ చేయాలని గగ్గోలు పెట్టారంటే శివ ప్రభావం నాటి తెలుగు సమాజం, కళాశాలలపై ఎలా పడిందో అర్థం చేసుకోవచ్చు.
ఈ సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్లుగాను, నటులుగాను పని చేసిన కృష్ణవంశీ, పూరి, తేజ తర్వాత స్టార్ దర్శకులు అయ్యారు. జేడీ చక్రవర్తి, రఘువరన్, ఉత్తేజ్, శుభలేఖ సుధాకర్, తనికెళ్ల భరణి కూడా తర్వాత పాపులర్ అయ్యారు. ఇలా ట్రెండ్ చేసిన సినిమాను మళ్లీ చేయాల్సి వస్తే ఏ హీరో చేస్తే బాగుంటుంది అన్న ప్రశ్నకు నాగార్జున షాకింగ్ ఇచ్చారు. ఈ సినిమాను మళ్లీ ఏ హీరో చేసినా బాగోదని… ఇలాంటి కథలను మళ్లీ టచ్ చేసి వాటి ఒరిజినల్ ఔన్యత్యాన్ని తగ్గించ కూడదని చెప్పారు.