Moviesఆ హీరోయిన్‌కు పెద్ద బ‌ద్ధ‌కం... ఫుల్ క్లాస్ పీకిన నాగార్జున‌

ఆ హీరోయిన్‌కు పెద్ద బ‌ద్ధ‌కం… ఫుల్ క్లాస్ పీకిన నాగార్జున‌

టాలీవుడ్ కింగ్ నాగార్జున త‌న కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఎంతో మంది హీరోయిన్ల‌తో న‌టించాడు. కెరీర్ ఆరంభంలోనే అప్ప‌ట్లో కోలీవుడ్ క్రేజీ హీరోయిన్‌గా ఉన్న ఖుష్బూతో నాగ్ న‌టించాడు. ఇక ఆ త‌ర్వాత బాలీవుడ్ అంద‌మైన హీరోయిన్లతో న‌టించ‌డం అంటే నాగ్‌కు మాత్ర‌మే చెల్లింది. అప్ప‌ట్లో బాలీవుడ్‌లో టాప్ రెమ్యున‌రేష‌న్లు తీసుకునే స్టార్ హీరోయిన్లు కూడా తెలుగులో నాగార్జున‌తో మాత్ర‌మే న‌టించేందుకు ఆశ ప‌డేవారు.

మ‌నీషా కోయిరాలా, దీప్తి భ‌ట్నాగ‌ర్‌, ఉర్మిళ‌, శ్రీదేవి, సోనాలి బింద్రే ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది స్టార్ హీరోయిన్లు నాగ్ ప‌క్క‌న న‌టించారు. ఇక ట‌బు కూడా నిన్నే పెళ్లాడుతా సినిమాలో నాగార్జున‌తో తొలిసారిగా న‌టించింది. నాగ్ ప‌క్క‌న ఎంత మంది హీరోయిన్లు న‌టించినా వారంతా కూడా ఆయ‌న‌తో న‌టించ‌డాన్ని ప్ర‌త్యేకంగా ఇష్ట‌ప‌డేవారు. అదే స‌మ‌యంలో బాలీవుడ్‌లో కూడా నాగ్ కొన్ని సినిమాలు చేసి హిట్ కొట్టాడు.

ఆ టైంలో బాలీవుడ్‌లో క్రేజ్ వ‌స్తున్నా.. తెలుగు మీదే కాన్‌సంట్రేష‌న్ చేయాల‌ని అక్క‌డ అవ‌కాశాలు వ‌దిలేసుకున్నాడు. ఇక నాగ్ ప‌క్కన ఇన్నేళ్ల‌లో ఇంత మంది న‌టించినా బాగా బ‌ద్ద‌కం హీరోయిన్ ఎవ‌ర‌ని ఆయ‌న్ను ఓ ఇంట‌ర్వ్యూలో జ‌య‌ప్ర‌ద ప్ర‌శ్నించారు. శ్రీయ త‌న దృష్టిలో బాగా లేజీ హీరోయిన్ అని.. ఆమె ఆల‌స్యానికి తాను సెట్లోనే చాలా సార్లు క్లాస్ పీకాన‌ని చెప్పారు.

ఇక వాగుడుకాయ ఎవ‌ర‌న్న ప్ర‌శ్న‌కు ర‌మ్య‌కృష్ణ పేరు చెప్పారు. చాలా గ్లో ఫేస్ ఉన్న హీరోయిన్ ఎవ‌ర‌న్న ప్ర‌శ్న‌కు అనుష్క పేరు చెప్పారు. అయితే త‌న భార్య అమ‌ల త‌ర్వాత మాత్ర‌మే అని చిన్న ట్విస్ట్ ఇచ్చారు. పై ముగ్గురు హీరోయిన్ల‌తోనూ నాగ్ ఎక్కువ సినిమాలు చేశారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news