మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఇద్దరూ కూడా మెగా కాంపౌండ్ హీరోలే. ఇద్దరూ మేనమామ, మేనత్త కొడుకులే. అయితే ఇద్దరూ టాలీవుడ్ స్టార్ హీరోలుగా ఉండడంతో ఇప్పుడు వీరి మధ్య టాప్ ప్లేస్ కోసం ఆధిపత్య పోరు నడుస్తోంది అన్నది నిజం. రంగస్థలం సినిమా ముందు వరకు చరణ్ కంటే బన్నీ కాస్త ముందున్నట్టే ఉండేది. అలాగే చాలా మందికి చెర్రీ నటనపై కూడా కొన్ని సందేహాలు ఉండేవి. రంగస్థలం వచ్చాక తనపై వస్తోన్న అన్ని విమర్శలకు చెర్రీ చెక్ పెట్టేయడంతో పాటు నటనలోనూ తానే ముందుంటానని ఫ్రూవ్ చేసుకున్నాడు.
అసలు రంగస్థలంలో చిట్టిబాబుగా చెర్రీ హవభావాలు చూసిన వారు ముక్కున వేలేసుకోవడంతో పాటు బన్నీ కంటే చెర్రీయే నటనలో టాప్ అని చర్చించుకున్నారు. అదే టైంలో బన్నీకి రెండు ప్లాపులు రావడంతో కాస్త డల్ అయ్యాడు. అయితే అల వైకుంఠపురంలో సినిమా తర్వాత ఇప్పుడు బన్నీ స్వింగ్‌లోకి వచ్చాడు. ఇలా వీరిద్దరి మధ్య పోటీ ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటోంది. రంగస్థలం డైరెక్టర్ సుకుమారే ఇప్పుడు బన్నీతో పుష్ప తీస్తున్నాడు.
రంగస్థలంలో చిట్టిబాబుగా చెర్రీని నెవ్వర్ బిఫోర్ క్యారెక్టర్‌లో చూపించిన సుక్కు ఇప్పుడు పుష్ప లో బన్నీని కూడా అదే రేంజ్లో చూపించేందుకు తాపత్రయ పడుతున్నాడు. ఇటు బన్నీకి కూడా రంగస్థలం కంటే పుష్పతో నటనా పరంగా టాప్‌లో ఉండాలని కసితో కష్టపడుతున్నట్టే కనిపిస్తోంది. అయితే పుష్ప స్టిల్స్, ప్రోమోలు, సాంగ్స్ చూస్తుంటే బన్నీ ఓవర్ ద బోర్డ్ వెళ్లిపోతున్నాడన్న సందేహాలు అయితే అందరిలోనూ వస్తున్నాయి.
రంగస్థలం స్టైల్లోనే లుక్స్‌పై స్పెషల్ ఇంట్రస్ట్ చూపించినట్టు ఉన్నా కూడా ఆ లుక్స్, మేనరిజమ్స్ మరీ శృతీ మించిపోయినట్టుగా ఉన్నాయి. దాక్కో మేక పాట కావచ్చు, ఏయ్ బిడ్డా పాటల్లో బన్నీ హావభావాలు, స్టెప్స్ ఏమంత ఆకట్టుకోలేదు సరికదా.. వాటిపై డివైడ్ టాక్ కూడా వచ్చేసింది. చెర్రీ చిట్టిబాబు పాత్రలో చాలా సహజత్వం కనిపించింది. బన్నీకి పుష్పలో అతడి క్యారెక్టర్ కన్నా కూడా కేవలం చిట్టిబాబును మించిపోవాలన్న తాపత్రమే కనపడుతోంది.
అందుకే పుష్ప స్టిల్స్, లుక్స్‌కు అల వైకుంఠపురములో సినిమాకు ముందు వచ్చిన ప్రి రిలీజ్ బజ్ రాలేదు. ఏదేమైనా చెర్రీని దాటిపోవాలన్న తాపత్రయమే బన్నీలో ఉండడంతో రేపటి రోజు పుష్ప రిజల్ట్ ఎలా ? ఉంటుందా ? అన్న డౌట్లు అయితే అందరిలోనూ ఉన్నాయి.