Moviesలేచిపోయి పెళ్లిచేసుకున్న టాలీవుడ్ ఫీమేల్ యాంక‌ర్‌..!

లేచిపోయి పెళ్లిచేసుకున్న టాలీవుడ్ ఫీమేల్ యాంక‌ర్‌..!

సినిమా ఇండ‌స్ట్రీ అయినా, బుల్లితెర అయినా కూడా గ్లామ‌ర్ ఫీల్డ్స్‌. ఇక్క‌డ పైకి క‌నిపించే రంగుల‌తో పాటు తెర‌వెన‌క క‌న‌ప‌డ‌ని సంగ‌తులు కూడా చాలానే ఉంటాయి. ఈ రంగంలో ఉన్న సెల‌బ్రిటీలు అంద‌రూ ప్రేమించి పెళ్లి చేసుకుంటూ ఉంటారు. అటు వెండితెర సెల‌బ్రిటీలు అయినా.. ఇటు బుల్లితెర సెల‌బ్రిటీలు అయినా కూడా ఎక్కువుగా ప్రేమ వివాహాలే చేసుకుంటూ ఉంటారు. బుల్లితెర‌పై యాంక‌ర్ల‌తో మొద‌లు పెడితే సీరియ‌ల్స్ లో న‌టించే పాపుల‌ర్ న‌టీన‌టులు అంద‌రూ కూడా ఎక్కువుగా ప్రేమ వివాహాలు చేసుకుని సెటిల్ అయిపోతూ ఉంటారు.

ఈ క్ర‌మంలోనే ప్రేమించి కులాంత‌ర వివాహాలు, మ‌తాంత‌ర వివాహాలు చేసుకున్న వారు కూడాఉన్నారు. పెద్ద‌లు కాద‌న‌డంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయి మ‌రీ పెళ్లి చేసుకున్న వారు ఉన్నారు. ఈ క్ర‌మంలోనే తెలుగు ఇండ‌స్ట్రీలో ఒక‌ప్పుడు స్టార్ యాంక‌ర్‌గా ఉన్న మ‌ని మేఘ‌లై కూడా ఇదే కోవ‌లోకి వ‌స్తారు. ఆమె హుస్సేన్ అనే వ్య‌క్తిని ప్రేమించి పెళ్లాడ‌తాన‌ని చెప్పింది. అయితే ఆమె కుటుంబ స‌భ్యులు ఆమె పెళ్లికి ఒప్పుకోలేదు.

మ‌ని మేఘ‌లై పెళ్లికి ఆమె తండ్రి ఒప్పుకోక‌పోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం .. ఆమె ప్రేమించిన హుస్సేన్ ముస్లిం వ్య‌క్తి కావ‌డ‌మే..! ఆ త‌ర్వాత ఆమె తండ్రికి తెలియ‌కుండానే ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. ఆ త‌ర్వాత ఆమె త‌న పెళ్లి ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రేమ‌కు, మ‌తానికి ఎలాంటి సంబంధం లేద‌ని.. ఆమె చెప్పుకు వ‌చ్చింది. త‌న ప్రేమ‌ను అర్థం చేసుకుని త్వ‌ర‌లోనే త‌న తండ్రి త‌న‌ను ఇంటికి పిలుస్తార‌న్న ఆశాభావం కూడా ఆమె వ్య‌క్తం చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news