Moviesత్రివిక్ర‌మ్ పెళ్లిలో ఇంత ఇంట్ర‌స్టింగ్ పాయింట్ ఉందా..!

త్రివిక్ర‌మ్ పెళ్లిలో ఇంత ఇంట్ర‌స్టింగ్ పాయింట్ ఉందా..!

తెలుగు సినిమా పరిశ్రమలో రచయితగా అడుగుపెట్టిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ రోజు టాలీవుడ్ లో నెంబర్ వన్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. నువ్వే నువ్వే సినిమాతో మెగా ఫోన్ పట్టిన త్రివిక్రమ్ అలవైకుంఠ‌పురంలో వరకు ఒకటి రెండు సినిమాలు మినహా అన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు తెరకెక్కించారు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేయాలంటే టాలీవుడ్ స్టార్ హీరోలు సైతం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఒకప్పుడు రచయితగా అవకాశాల కోసం హీరోలు, దర్శకుల చుట్టూ ప్రదక్షిణలు చేసిన త్రివిక్రమ్ ఇప్పుడు తన కోసం వాళ్లు వెయిట్ చేసే స్థాయికి ఎదిగి పోయారు.

ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ బాబు తో ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ – అల్లు అర్జున్ తో కూడా త్రివిక్ర‌మ్‌కు వరుసగా సినిమాలు ఉన్నాయి. అలాగే సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తోనూ ఓ సినిమా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక త్రివిక్ర‌మ్ వ్యక్తిగతం విషయానికొస్తే పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం లో ఆయన జన్మించారు. భీమ‌వ‌రం డీఎన్నార్ కాలేజ్‌లో చ‌దువుకున్నారు. ఆ టైం నుంచే క‌మెడియ‌న్ సునీల్ – త్రివిక్ర‌మ్ మంచి ఫ్రెండ్స్‌.

కొంతకాలం ఉపాధ్యాయుడిగా పని చేసిన ఆయన సినిమా రంగంపై ఆసక్తితో ఇండస్ట్రీ లోకి వచ్చారు. ముందు పోసాని కృష్ణ‌ముర‌ళీ ద‌గ్గ‌ర అసిస్టెంట్ గా పని చేశారు. త్రివిక్రమ్ 1998లో వేణు హీరోగా వచ్చిన స్వయంవరం సినిమాతో తొలిసారిగా మాటల రచయితగా మారారు. అక్కడినుంచి మ‌న్మ‌థుడు సినిమాతో టాలీవుడ్ లోనే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

త్రివిక్రమ్ భార్య సౌజన్య. ఈమె ప్రముఖ మాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి సమీప బంధువు. త్రివిక్రమ్ పెళ్లి విషయానికొస్తే చాలా విచిత్రంగా జరిగిందని ఆయన చెబుతుంటారు. ముందుగా సౌజన్య వాళ్ళ అక్కను పెళ్లి చేసుకోడానికి ఆయ‌న వెళ్లారు. అక్కడ తొలిచూపులోనే సౌజ‌న్య‌ను ప్రేమించి… ఆమె కుటుంబ సభ్యులతో ఆమెనే పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పారు.

సౌజ‌న్య కుటుంబ స‌భ్యులు మాత్రం ముందుగా పెద్దమ్మాయి పెళ్లి చేసేంతవరకు ఆగాల‌ని చెప్పారట. అలా సౌజన్య వాళ్ళ అక్క పెళ్లి అయ్యాక సౌజన్య – త్రివిక్రమ్ పెళ్లిచేసుకున్నారు. ఈ దంపతులు వివాహం 2002లో జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news