ఇండస్ట్రీ అంతా కొందరు చెప్పు చేతల్లోనే ఉంటుందన్న విమర్శలు ముందు నుంచి ఉన్నాయి. కొందరు బడా బడా నిర్మాతలు దర్శకులకు భారీగా అడ్వాన్స్‌లు ఇచ్చి వారి డేట్లు లాక్ చేస్తారు. మరి కొందరు వేరే హీరోల కోసం దర్శకులు రాసుకున్న మంచి కథలను కూడా ఒత్తిడి చేసి తాము తీసేసుకుంటారు. ఇక థియేటర్ల గుత్తాధిపత్యం గురించి నడుస్తోన్న యుద్ధాలు తెలిసిందే. అయితే కరోనా దెబ్బతో పాటు ఓటీటీ ఎంట్రీ ఇచ్చాక ఈ అణగదొక్కే కార్యక్రమాలు కొంత తగ్గాయి. టాలెంట్ ఉండాలే కాని.. ఎవ్వరిని ఆపలేరన్న సత్యం అయితే అందరికి అర్థమైంది.
ఇదిలా ఉంటే నేచురల్ స్టార్ నానిని ఇండస్ట్రీలో కొందరు… ఇంకా చెప్పాలంటే ముఖ్యంగా ఓ వర్గం తెరవెనక చాటుగానే తొక్కేసే ప్రయత్నాలు చేస్తోందట. గత నాలుగైదేళ్ల నాటు నాని ఏకంగా వరుసగా 8 హిట్ సినిమాల్లో నటించాడు. నాని నటించిన సినిమా వచ్చిందంటే చాలు హిట్. అలాంటి నాని రెండేళ్లుగా కాస్త వెనక పడుతున్నాడు. సినిమా కథ బాగున్నా.. టాక్ బాగా రావడం లేదు.. కలెక్షన్లు కూడా అనుకున్న స్థాయిలో రావడం లేదు.
నాని సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు.. బిజినెస్ జరిగే టైంలోనే ముందుగానే ట్రేడ్ వర్గాల్లో సినిమా బాలేదో అన్న బ్యాడ్ టాక్ బాగా స్ప్రెడ్ చేస్తున్నారట. ఇక రిలీజ్ అయ్యాక విమర్శకులు, ప్రేక్షకులు సినిమా బాగుందని అనుకున్నా కూడా ఆ వర్గం గ్యాంగ్ మాత్రం నెగిటివ్ టాక్ బాగా స్ప్రెడ్ చేస్తున్నారని తెలుస్తోంది. సినిమాను ఏదోలా దెబ్బతీసే వరకు వీళ్లు నెగిటివ్ ప్రచారం మాత్రం ఆపడం లేదని ఇండస్ట్రీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
నాని కూడా కరోనా టైంలో ఓ మెట్టు వెనక్కు తగ్గి వీ, టక్ జగదీష్ సినిమాలను ఓటీటీ రిలీజ్ చేసేశాడు. దీంతో కొందరు ఆయన్ను టార్గెట్ చేసినా వెనక్కు తగ్గలేదు. ఇక తాజాగా నాని నటించిన శ్యామ్ సింగ రాయ్ డిసెంబర్ 24న రానుంది. ఎప్పుడో నెలన్నర క్రితమే వాళ్లు ఆ డేట్ వేసుకుని ఉన్నారు. అయితే ఇప్పుడు అదే డేట్‌కు ఓ మెగా కాంపౌండ్ సినిమా వస్తోంది. దీంతో థియేటర్లు ఇవ్వం.. ఆ డేట్ నుంచి తప్పుకోమని ఒత్తిళ్లు వెళుతున్నాయట. అదే జరిగితే ఇక నాని సినిమా ఏ ఫిబ్రవరికో లేదా సమ్మర్‌కో వెళ్లిపోవాలి.
ఇలా ప్రతిసారి ఆ వర్గం నాని సినిమాలనే టార్గెట్ చేస్తూ ఉండడంతో నానికి సపోర్ట్ చేద్దాం అంటూ సోషల్ మీడియాలో మరో వర్గం చర్చ కూడా పెడుతోన్న పరిస్థితి. మరి ఈ వార్ ఎలా ఉంటుందో ? చూడాలి.