Moviesపది వారాలకు ఇంతేనా.. జెస్సీకి అన్యాయం చేసిన బిగ్ బాస్..?

పది వారాలకు ఇంతేనా.. జెస్సీకి అన్యాయం చేసిన బిగ్ బాస్..?

ఎపిసోడ్‌.. ఎపిసోడ్‌కు బిగ్‌బాస్‌ రియాలిటీ షో రసవత్తరంగా మారుతోంది. బిగ్‌బాస్‌ సీజన్ ఫైవ్ లోకి ఎనమిదో కంటెస్టెంట్‌గా అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చిన అందరిని ఆశ్చర్యపరిచిన మోడల్ జెస్సీ .. అంతే అనూహ్యంగా హౌజ్ నుంచి బయటకు వచ్చాడు. అనారోగ్య కారణంగా జెస్సీ బిగ్‌బాస్ షో నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అనారోగ్యం వెంటాడ‌టంతో జెస్సీ బిగ్‌బాస్ షో నుంచి త‌ప్పుకోక త‌ప్ప‌లేదు. సీక్రెట్ రూమ్‌లో పెడితే త‌న‌ను తిరిగి హౌస్‌లోకి పంపిస్తారేమోన‌ని వేయి క‌ళ్ల‌తో ఎదురు చూసిన జెస్సీ నిరాశే ఎదురైంది.

అయితే వెళ్లిపోయేముందు జెస్సీ కంటెస్టెంట్ల‌కు విలువైన సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇచ్చాడు. ల్యాండ్‌ఫోన్ ద్వారా ఒక్కొక్క‌రితో ప‌ర్స‌న‌ల్‌గా మాట్లాడే అవ‌కాశం క‌ల్పించాడు బిగ్‌బాస్‌.దీంతో అందరికి మంచి సజీషన్స్ ఇచ్చాడు జెస్సి. అయితే పది వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు జెస్సికి ఎమత్ రెమ్యూనరేషన్ ఇచ్చి ఉంటారు అనే టాక్ హాట్ టాపిక్ గా మారింది.

ఇక అందుతున్న సమాచారం ప్రకారం..జెస్సీకి వారానికి రూ. 1.5 లక్షలు పారితోషికాన్ని షో నిర్వాహకులు ఇచ్చినట్లు తెలుస్తోంది. అంటే ఈ లెక్కన చూసుకుంటే మొత్తం రూ. 10 -11 లక్షల వరకు జెస్సీ అందుకున్నట్టుగా సమాచారం. నిజానికి మిగతా కంటెస్టేంట్ లతో పోల్చుకుంటే జెస్సికి ఇచ్చింది తక్కువే అంటున్నారు నెటిజన్స్. టైటిల్ విన్ అవ్వలేకపోయినా అందరి మనసులను మాత్రం గెలుచుకున్నాడు. ఇక త్వరలోనే ఆయన పూర్తి ఆరోగ్యవంతంగా కావాలి స్ని కోరుకుంటున్నారు ఆయ్న అభిమానులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news