ప్రముఖ స్టార్ హీరోయిన్ గా దాదాపు పది సంవత్సరాల పాటు చలామణి అయిన రోజా , ఆ తరువాత బుల్లితెరపై తన ప్రస్థానాన్ని మొదలుపెట్టింది. సినిమాల నుంచి నేరుగా రాజకీయాల్లోకి ప్రవేశించి టిడిపి పార్టీలో చేరి అక్కడ ఎన్నో సమస్యలను ఎదుర్కొంది. ఆ తర్వాత వైసీపీ పార్టీలోకి చేరిన రోజా నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలుపొందింది. డబ్బులు లేక నష్టాల్లో కూరుకుపోయిన సమయంలో వైసిపి పార్టీ అలాగే బుల్లితెరపై ప్రసారమవుతున్న ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ రెండూ తనను ఆదుకున్నాయి అని ఆమె ఒక ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించింది.
ఇక ప్రస్తుతం రాజకీయాలలో తన జీవితాన్ని బిజీగా గడుపుతోంది.. మరొకవైపు ప్రజలకు సహాయం చేస్తూ, మరొకవైపు బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో లో జడ్జిగా వ్యవహరిస్తోంది. బతుకుజట్కాబండి పేరిట ఎంతో మంది జీవితాలను నిలబెడుతోంది. అంతే కాదు కొంత మంది పిల్లల్ని కూడా తన సొంత డబ్బుతో చదివిస్తూ ఉండడం గమనార్హం. ఇక రాజకీయ నాయకురాలిగా కూడా నగరి అభివృద్ధికి పాటుపడుతూ ప్రజలలో మంచి నాయకురాలిగా గుర్తింపు తెచ్చుకుంది.
ఇకపోతే తల్లి బాటలోనే కూతురు అన్నట్టుగా తన కూతురు అన్షు మాలిక కూడా అది చిన్న వయసులోనే మంచి గుర్తింపు తెచ్చుకోవడం గమనార్హం..రోజా ఇటీవల మాట్లాడుతూ.. తన కూతురు ఒక ప్రముఖ ఎన్జీవో ఆర్గనైజేషన్ ద్వారా ఐదు మంది పిల్లలను దత్తత తీసుకొని చదివిస్తోంది అని, ఇంత చిన్న వయసులోనే తన కూతురికి అలాంటి ఆలోచన వచ్చినందుకు తనకు చాలా గర్వంగా ఉందని ఆమె చెప్పుకొచ్చింది.
అంతే కాదు తన కూతురు మాలికకు చదువు అంటే ఎనలేని ఇష్టం అని, ఆమె ఎప్పుడూ నిరంతరం పుస్తకాలను చదువుతూనే ఉంటుంది అని తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు అన్షు మాలికను పొగడ్తలతో ముంచెత్తడమే కాకుండా తల్లికి తగ్గ కూతురు అంటూ అభినందిస్తున్నారు.