ఈ మధ్యకాలంలో పెళ్లి అనే పదం అంటే దూరంగా ఉంటున్నప్పటికీ, తమకు నచ్చిన వారితో డేటింగ్ చేసి శారీరకంగా కలిసి, పిల్లల్ని కూడా కనడానికి సిద్ధమవుతున్నారు చాలామంది స్టార్ హీరోయిన్లు. మరి వీరికి పెళ్లి అనే పదం అంటే ఎందుకు ఇష్టం లేదో తెలియడం లేదు కానీ, పిల్లల్ని కన్న తర్వాతనే పెళ్లిళ్లు చేసుకున్నారు. అందాల తార అతిలోక సుందరి శ్రీదేవి ని మొదలు కొని ప్రముఖ హీరోయిన్ రేణు దేశాయ్ తో సహా చాలామంది పెళ్లికి ముందే డేటింగ్ చేసి పిల్లల్ని కూడా కన్నారు. ఇక్కడ విడ్డూరం ఏమిటంటే , ఆ పిల్లల సమక్షంలో ని పెళ్లిళ్లు కూడా చేసుకున్నారు. అలా ఎవరెవరు పెళ్లికి ముందే గర్భం దాల్చారో వారి గురించి తెలుసుకుందాం.
1. శ్రీదేవి:
ప్రముఖ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీదేవి బోని కపూర్ తో రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడే ఈమె ఓపెన్ గానే అందరితోనూ ప్రెగ్నెంట్ అని ప్రకటించింది. అయితే బోనీ కపూర్ ను వివాహం చేసుకొనే సమయానికి శ్రీదేవి ఏడు నెలల గర్భవతి.. అలా పెళ్లి కాగానే జాన్వీ కపూర్ కు జన్మనిచ్చింది శ్రీదేవి.
2. కొంకణ సేన్ శర్మ:
రణవీర్ షోరే తో చాలాకాలం పాటు డేటింగ్ చేసిన ఈ ముద్దుగుమ్మ, సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది. కానీ అప్పటికే గర్భం దాల్చింది.. కాబట్టి కొన్ని నెలలకు ప్రెగ్నెంట్ అని ప్రకటించింది.
3. నీనా గుప్తా:
వెస్టిండీస్ క్రికెటర్ వివ్ రిచర్డ్స్ తో డేటింగ్ చేసి ప్రెగ్నెంట్ అయింది నీనా..ఇకపోతే రిచర్డ్స్ తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వడానికి ఏ మాత్రం ఒప్పుకోలేదు.. కానీ నీనా మాత్రం ఒక బిడ్డకు జన్మనిచ్చింది.
4. సారిక:
కమలహాసన్ ,సారిక తో పెళ్లికి ముందే శృతిహాసన్ కు జన్మనిచ్చారు. ఇక ఈమె పుట్టిన తర్వాత దాదాపు రెండు సంవత్సరాలకు పెళ్లి చేసుకోవడం జరిగింది.
5. రేణు దేశాయ్:
పవన్ కళ్యాణ్ రెండో భార్య రేణుదేశాయ్ తో డేటింగ్ చేసి అకీరానందన్ కు జన్మనిచ్చారు. ఇక వీరిద్దరూ కొడుకు సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.
6. అమీ జాక్సన్:
తన స్నేహితుడు జార్జ్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్న వెంటనే ఈమె ప్రెగ్నెంట్ అని ప్రకటించింది. ఇప్పుడు ఒక బిడ్డకు జన్మనిచ్చింది.
7. అమృత అరోరా:
పెళ్లికి ముందే ఈమె షకీలా లడక్ తో రిలేషన్ షిప్ లో ఉండి ప్రెగ్నెంట్ కూడా అయింది .ఇక ఈ విషయం ప్రకటించిన కొద్ది రోజులకే పెళ్లి చేసుకుంది.
ఇక వీరితో పాటు లీసా హెడెన్, గాబ్రియెల్లా దెమెత్రియాడేస్, నేహా దుపియా, నటాషా స్టాన్ కోవిచ్, కల్కి కొచ్లిన్ కూడా పెళ్ళికి ముందే గర్భం దాల్చారు.