Moviesపెళ్లి చేసుకోవాల‌నుకున్న క‌రిష్మా - అభిషేక్ ఎందుకు విడిపోయారు..!

పెళ్లి చేసుకోవాల‌నుకున్న క‌రిష్మా – అభిషేక్ ఎందుకు విడిపోయారు..!

మ‌న‌దేశంలో కొంద‌రు సెల‌బ్రిటీల్లో అబ్బాయిల కంటే అమ్మాయిల వ‌య‌స్సు ఎక్కువుగా ఉన్నా కూడా వారు పెళ్లి చేసుకున్న సంద‌ర్భాలు ఉన్నాయి. భార‌త మాజీ స్టార్ క్రికెట్ స‌చిన్ టెండుల్క‌ర్ కంటే ఆయ‌న భార్య అంజ‌లి వ‌య‌స్సు 6 ఏళ్లు పెద్ద‌. ఇక మాజీ ప్ర‌పంచ సుంద‌రి ఐశ్వ‌ర్యారాయ్ – బాలీవుడ్ బీగ్ బీ అమితాబ్ కుమారుడు అభిషేక్ బ‌చ్చ‌న్‌ను పెళ్లాడింది. ఈ దంప‌తుల‌కు ఆరాధ్య అనే కుమార్తె కూడా ఉంది. మ‌రి అభిషేక్ కంటే ఐశ్వ‌ర్య యేడాది పెద్ద‌.

అభిషేక్‌ను పెళ్లి చేసుకునే ముందే ఐశ్వ‌ర్య కండ‌ల వీరుడు స‌ల్మాన్‌ఖాన్‌తో ప్రేమాయ‌ణం న‌డిపింది. త‌ర్వాత వీరు విడిపోయారు. త‌ర్వాత ఐశ్వ‌ర్య వివేక్ ఒబెరాయ్‌తో కూడా ఎఫైర్ న‌డిపింద‌న్న టాక్ ఉంది. ఆ త‌ర్వాత అభిషేక్‌ను పెళ్లి చేసుకుంది. అయితే ఇదే టైంలో అభిషేక్ బ‌చ్చ‌న్ కూడా అప్ప‌ట్లో బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఉన్న క‌రిష్మా క‌పూర్‌తో ప్రేమ‌లో ప‌డ్డాడు. అదే టైంలో క‌రిష్మా చెల్లి క‌రీనా మ‌రో స్టార్ హీరో సైఫ్ ఆలీఖాన్‌తో ప్రేమ‌లో ప‌డింది.

ఇక క‌రిష్మా – అభిషేక్ విష‌యానికి వ‌స్తే వీరి ఎంగేజ్‌మెంట్ కూడా అయ్యింది. వీరి పెళ్లికి ముహూర్త‌మే త‌రువాయి అనుకుంటోన్న టైంలో పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. అభిషేక్ తల్లి జ‌యాబ‌చ్చ‌న్‌కు క‌పూర్ ఫ్యామిలీకి చెందిన క‌రిష్మాను కోడ‌లిగా చేసుకోవ‌డం ఎంత మాత్రం ఇష్టం లేద‌ట‌. అయితే క‌రిష్మా , అభిషేక్‌కు కొన్ని కండీష‌న్లు పెట్టింద‌ట‌. పెళ్లి త‌ర్వాత ప‌ర్స‌న‌ల్‌గా ఫ్యామిలీ పెట్టాల‌ని చెప్పింద‌ట‌.

అంటే అభిషేక్‌ను త‌ల్లిదండ్రుల‌ను వ‌దిలి వ‌చ్చేయాల‌ని కోరింది. ఇది అభిషేక్‌తో పాటు జ‌యాకు ఇష్టంలేద‌ట‌. చివ‌ర‌కు ఆమె కండీష‌న్ల‌కు ఇష్టంలేక క‌రిష్మాతో పెళ్లినే బ‌చ్చ‌న్ ఫ్యామిలీ క్యాన్సిల్ చేసుకుంది. ఆ త‌ర్వాత అభిషేక్‌- ఐశ్వ‌ర్య‌ను పెళ్లి చేసుకున్నారు. క‌రిష్మా ఓ ఎన్నారైను పెళ్లి చేసుకుంది. ఇక ఇటీవ‌లే ఆమె భ‌ర్త‌కు విడాకులు ఇచ్చేసి తిరిగి ఇండియాకు వ‌చ్చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news