తెలుగులో మన్మథుడు నాగార్జున చాలా మంది బాలీవుడ్ హీరోయిన్లతో నటించాడు. సోనాలి బింద్రే, జూహీచావ్లా, ఊర్మిళ, టబు ఇలా చాలా మంది బాలీవుడ్ హీరోయిన్లతో నటించాడు. ఒకానొక టైంలో నాగ్ అందానికి బాలీవుడ్ కూడా ఫిదా అయ్యింది. అయితే నాగ్ తెలుగు మీదే కాన్సంట్రేషన్ చేయడంతో బాలీవుడ్ ఛాన్సులు వదులుకున్నాడు. ఇదిలా ఉంటే బాలీవుడ్లో కింగ్ ఖాన్ షారుక్ కూడా 1990 వ దశకంలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగాడు. ఇప్పుడు వరుస హిట్లతో దూసుకుపోతోన్న అమీర్‌ఖాన్, సల్మాన్‌ఖాన్ వరుస ప్లాపులతో ఉన్నప్పుడు షారుక్దే రాజ్యం అన్నట్టుగా ఉండేది.
షారుక్ నటించిన సినిమాలు అప్పట్లో 100 రోజుల నుంచి సంవత్సరాల పాటు ఆడేవి. ప్రేమించి పెళ్లాడుతా సినిమా అయితే సంవత్సరాల పాటు ఆడి భారతీయ సినిమా చరిత్రలోనే సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే అప్పట్లో షారుక్ – కాజల్ జంటకు మంచి క్రేజ్ ఉండేది. వీరి మధ్య ఎఫైర్ ఉండేదన్న రూమర్లు కూడా ఉండేవి. అప్పట్లో వీరి కాంబోలో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. వీరి జంట కలిసి నటిస్తే చాలు కాసుల వర్షం కురిసేది. అందుకే వీరి కాంబినేషన్ అంటే దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులకు పండగే.
అయితే భార్య గౌరీ వార్నింగ్ ఇవ్వడంతోనే కాజల్‌కు షారుక్ పూర్తిగా దూరమయ్యాడని అంటారు. షారుక్‌కు కాజల్‌తో మాత్రమే కాకుండా మరో హీరోయిన్‌తో కూడా ఎఫైర్ ఉందన్న రూమర్లు అప్పట్లో బీ టౌన్లో ఎక్కువుగా వినిపించేవి. ఆ హీరోయిన్ ఎవరో కాదు. ఆ హీరోయిన్ ఎవరో కాదు జూహీచావ్లా. జూహీచావ్లా – షారుక్ ఎంతో క్లోజ్‌గా ఉండేవారు. వారి బంధం, సాన్నిహిత్యం అప్పటి నుంచి కంటిన్యూ అవుతూనే వస్తోంది. తాజాగా షారుక్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో చిక్కుకున్నప్పుడు కూడా జూహీయే ఎక్కవుగా షారుక్ కుటుంబానికి ధైర్యం చెప్పి.. వెంట నిలబడింది.
ఇక ఆర్యన్ తన 24వ పుట్టిన రోజు జరుపుకోవడంతో అతడి పేరిట తాను 24 మొక్కలు నాటతానని కూడా జూహీ ప్రమాణం చేసింది. అలాగే తన పిల్లలతో కలిసి ఉన్న ఆర్యన్ చిన్న నాటి ఫొటో షేర్ చేసి బర్త్ డే విషెస్ చెప్పింది.