సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలకు పని చేసేందుకు ఛాన్స్ వస్తే ఏ టెక్నీషియన్ అయినా ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాల్లో నటించే హీరోయిన్ అయినా, నటులు అయినా, దర్శకులు అయినా ఎవరైనా వారు చాలా గొప్పగా ఫీల్ అవుతారు. ఇక ఇండియన్ సినిమా గర్వించదగ్గ మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఏఆర్. రెహ్మన్ – రజనీ కాంబినేషన్ అంటే సినీ లవర్స్‌కు ఎంత పెద్ద పండగో చెప్పక్కర్లేదు.
అయితే ఏఆర్ . రెహ్మన్ మాత్రం రజనీ సినిమాలకు పని చేయడం ఓ నరకం లాంటిది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు వీరి కాంబోలో చాలా బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. ముత్తు – అరుణాచలం – బాబా – శివాజీ – రోబో – కొచ్చాడయాన్ – రోబో 2.0 సినిమాలు వచ్చి అన్ని మ్యూజికల్గా అదరగొట్టేశాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రజనీ కాంత్ మాట్లాడుతూ రజనీ సినిమాలను తాను పని చేసినన్ని రోజులు ఏ మాత్రం ఆహ్లాదంగా ఉండేది కాదని చెప్పారు.
రజనీ సినిమాలకు మార్చి నెలలో వర్క్ స్టార్ట్ చేస్తే దీపావళి అయ్యేది.. దీపావళి నుంచి రజనీ సినిమాలు రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయ్యేవి. ఆ టైంలోనే పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వాల్సి ఉండేది. తాను ఉండే ప్రదేశంలో ఎక్కువుగా విద్యుత్ ఉండేదని. రెండు జనరేటర్లు కూడా ఉండేవని.. పైగా ఒకేసారి ఎక్కువ ప్రాజెక్టులు చేయాల్సి రావడంతో ఈ వాతావరణంలో పని చేయడం తనకు నరకంగా ఉండేదని రెహ్మన్ చెప్పారు.
అందుకే దీపావళి అయినా న్యూ ఇయర్ అయినా, పొంగల్ అయినా తాను చాలా సార్లు వాటిని మిస్ అయిపోయానని.. ఇప్పుడు మాత్రం తనకు ఎక్కువ రిలాక్స్ దొరుకుతోందని చెప్పాడు.