ఇండస్ట్రీలో హీరోలు అయినా హీరోయిన్లు అయినా వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా ఉండాలి.. కెరీర్ పరంగా ఎన్ని హిట్లు వచ్చినా కూడా వ్యక్తిగత జీవితంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తేనే వీరు సుధీర్ఘకాలం ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటారు. తప్పటడుగులు వేసే వారు త్వరగానే కెరీర్ను చేజేతులా నాశనం చేసుకుంటారు. ఈ క్రమంలోనే ఓ హీరోయిన్ తప్పటడుగులతో తన కెరీర్ తానే నాశనం చేసుకుందన్న టాక్ ఉంది. ఆర్యన్ రాజేష్ తొలి సినిమా హాయ్ హీరోయిన్ నిఖిత.. ఆ తర్వాత తెలుగులో చాలా సినిమాలే చేసింది.
తెలుగులో ఆమె ఫామ్లో ఉన్నప్పుడు వరుస పెట్టి సినిమాలు చేసింది. తర్వాత సడెన్గా మాయం అయిపోయిన నిఖిత అప్పుడప్పుడు సోషల్ మీడియాలో మాత్రం తన అందమైన ఫొటోలు షేర్ చేస్తూ తాను కూడా ఉన్నానన్న హింట్ ఇస్తూ ఉంటుంది. ఆమె కెరీర్ స్వింగ్లో ఉన్నప్పుడు ఓ కన్నడ టాప్ హీరోతో ప్రేమలో పడిందని.. అందుకే ఆమె కెరీర్ నాశనం అయ్యిందని అంటారు. ఓ సినిమా షూటింగ్లో వారిద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో వారు పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారట.
అయితే అప్పటికే సదరు స్టార్ హీరోకు పెళ్లి కావడంతో.. ఆ విషయం తెలిసిన నిఖిత ఆ సినిమా షూటింగ్ స్పాట్లోనే ఆ హీరోతో పలుమార్లు గొడవకు దిగేదట. అందుకే ఈ మ్యాటర్ పబ్లిక్కు కూడా బాగా తెలిసిపోయింది. దీంతో ఆ హీరో తన భార్యకు తెలియకుండానే నిఖితకు ముంబైలో ఓ ఖరీదైన ఇళ్లు కూడా కొనిచ్చాడట. తర్వాత వీరి మధ్య మనస్పర్థలు రావడంతో వీరి ప్రేమ బ్రేకప్ అయ్యింది.
ఆ స్టార్ హీరోతో ఆమెకు వచ్చిన గొడవ వల్లే కన్నడ సినిమా ఇండస్ట్రీని ఆమెను కొంత కాలం బ్యాన్ చేసిందన్న టాక్ ఉంది. అప్పట్లో నిఖిత అక్కడ స్టార్ హీరోయిన్గా ఉంది. ఆ తర్వాత తెలుగులోనూ అవకాశాలు తగ్గిపోవడంతో ఆమె సినిమాలకు పూర్తిగా దూరమైపోయింది.