బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఆమెకు అది అలవాటుగా మారిపోయింది.తెలుగులో శ్రీ రెడ్డి ఎంత కాంట్రవర్సీ అయ్యారో ఇప్పుడు నార్త్‌లో కంగనా కూడా అంతే కాంట్రవర్సీ అయిపోయింది. ఆమె బీజేపీ మాటలనే చెపుతున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. అందుకే ఆమె బీజేపీ ప్రాపకంతోనే పద్మ అవార్డును కూడా గెలుచుకున్నారన్న ఆరోపణలు ఆమెపై ఉన్నాయి.
తాజాగా ఆమె స్వాతంత్య్రంపై చేసిన కామెంట్లు కూడా రకరకాల విమర్శలకు దారి తీస్ఉతన్నాయి. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చింది 1947లో కాదు.. 2014లో అంటూ ఓ కామెంట్ చేసింది. అంటే మోడీ ప్రధానమంత్రి అయ్యాకే స్వాతంత్య్రం వచ్చిందన్న అర్థంలో ఆమె మాట్లాడారు. దీనిపై కూడా విమర్శలు వస్తున్నాయి. కంగనా కామెంట్‌పై సీపీఐ జాతీయ కార్యదర్శి అయిన డాక్టర్ కె.నారాయణ ఘాటైన కౌంటర్ ఇస్తూ తీవ్రంగా మండిపడ్డారు.
ఆమె వ్యాఖ్యలు దేశాన్ని అవమానించేలా ఉన్నాయన్న నారాయణ.. ఆమె ఓ విలాసవంతమైన యాచకురాలు… ఆమెకు పద్మ శ్రీ ఎలా వచ్చిందో అందరికి తెలుసు… దేశ స్వాతంత్య్రంపై మాట్లాడే అర్హత ఆమెకు లేదని నారాయణ చెప్పారు. మోడీ ప్రధానమంత్రి అయ్యాకే మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని చెప్పడం కంగన బానిస మనస్తత్వానికి నిదర్శనం అని నారాయణ ఎద్దేవా చేశారు. ఆమె తక్షణమే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఏదేమైనా నారాయణ పేల్చిన పంచ్ మామూలుగా లేదనే చెప్పాలి.