తెలుగు సినిమా రంగంలో మెగాస్టార్ చిరంజీవి స్టామినా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నాలుగు దశాబ్దాల కెరీర్లో ఉన్నా ఇప్పటకీ యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ చిరంజీవి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబడుతున్నాయి. పదేళ్లు చిరంజీవి గ్యాప్ తీసుకుని ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చినా కూడా చిరంజీవి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని ఆ సినిమా ఫ్రూవ్ చేసింది.
చిరంజీవి ఎన్నో సార్లు హ్యాట్రిక్ హిట్లు కొట్టారు. అలాగే డబుల్ హ్యాట్రిక్ హిట్లు కూడా ఆయన ఖాతాలో ఉన్నాయి. 1987 – 1992 మధ్య ఆరు సంవత్సరాల కాలంలో వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టాడు. ఈ ఆరు సినిమాలలో రెండు సినిమాలకు కోదండ రామిరెడ్డి దర్శకుడు కాగా.. మరో రెండు సినిమాలకు కె. రాఘవేంద్ర రావు, మరో సినిమాకు విజయ బాపినీడు దర్శకత్వం వహించారు. మరో సినిమాకు రవిరాజా పినిశెట్టి దర్శకుడు.
ఈ సినిమాల లిస్ట్ చూస్తే పసివాడి ప్రాణం. ఈ సినిమా తర్వాత చిరు మార్కెట్ బాగా పెరిగింది. ఆ తర్వాత అత్తకుయముడు అమ్మాయికి మొగుడు. ఈ సినిమాలో విజయశాంతి హీరోయిన్. ఈ సినిమా అదిరిపోయే మాస్ కమర్షియల్ హిట్ అయ్యింది. ఇక యముడికి మొగుడు కూడా సూపర్ హిట్. రవిరాజా పినిశెట్టికి మంచి కమర్షియల్ డైరెక్టర్ అన్న గుర్తింపు వచ్చింది.
ఆ తర్వాత జగదేకవీరుడు అతిలోక సుందరి. ఈ సినిమాకు కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఆ తర్వాత విజయ బాపినీడు దర్శకత్వం వహించిన గ్యాంగ్ లీడర్ కూడా సూపర్ హిట్టే.. ఇక మరోసారి కె. రాఘవేంద్ర రావు – చిరు కాంబినేషన్లో వచ్చిన ఘరానా మొగుడు కూడా సూపర్ హిట్ అయ్యింది. ఇలా ఆరేళ్లు వరుస హిట్లతో చిరు ఏలేశాడు.