టాలీవుడ్లో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ స్టైలే వేరు. కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన కలియుగ పాండవులు సినిమాతో హీరోగా పరిచయం అయిన వెంకటేష్ ఇండస్ట్రీలోకి వచ్చి 35 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటకీ కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ దూసుకు పోతున్నాడు. పైగా ఈ తరం యువ హీరోలతో వెంకీ చేసినన్ని మల్టీస్టారర్లు ఏ సీనియర్ హీరో కూడా చేయలేదు.
ఎక్కువుగా ఫ్యామిలీ కథా చిత్రాలకు కేరాఫ్ అయిన వెంకటేష్ తన కెరీర్లో ఎక్కువ విజయాల శాతం కలిగి ఉన్నాడు. వెంకీ సినిమాలకు సక్సెస్ రేటు ఎక్కువ. అయితే వెంకటేష్ చేజేతులా కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు వదులుకున్నాడు. అవి కూడా ఆయన చేసి ఉంటే వెంకీ కెరీర్ ఖచ్చితంగా మరో రేంజ్లో ఉండేదనే చెప్పాలి. ఆ సినిమాలేంటో చూద్దాం.
– తిరుమల కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో ముందుగా శర్వానంద్ కాకుండా వెంకీని హీరోగా అనుకున్నారు.
– ఇక కృష్ణవంశీ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన గోవిందుడు అందరివాడేలే సినిమాలో చరణ్ బాబాయ్ శ్రీకాంత్ పాత్రకు ముందుగా వెంకీని అనుకున్నారు. ఆ తర్వాత ఆ పాత్రను వెంకటేష్ రిజెక్ట్ చేయడంతో చివరకు శ్రీకాంత్ చేశాడు.
– ఇక కృష్ణ వంశీ డైరెక్ట్ చేసిన ఖడ్గం సినిమాలో శ్రీకాంత్ పాత్ర కోసం వెంకటేష్‌ను అనుకున్నారు. వెంకీ డేట్లు సర్దుబాటు చేయలేకపోవడంతో శ్రీకాంత్ చేశాడు.
– వీటితో పాటు క్రాక్ – ఒకే ఒక్కడు – కృష్ణం వందే జగద్గురుమ్ వంటి సినిమాలను కథలు ముందు వెంకీ దగ్గరకే వచ్చాయి.