కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణాన్ని దేశ వ్యాప్తంగా సినీ అభిమానులే కాకుండా సాధారణ జనాలు సైతం జీర్ణించు కోలేక పోతున్నారు. కేవలం 46 సంవత్సరాల వయస్సు.. ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న ఈ స్టార్ హీరో గుండె పోటుతో మృతి చెందడం ఎంతో మంది అభిమానులకు వేదన మిగిల్చింది. రోజులు గడుస్తున్న కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణించారు అన్న విషయాని అభిమానులు ఇంకా మర్చిపోలేకపోతున్నారు.
అభిమానులంతా ప్రేమగా అప్పు అని పిలుచుకునే పునీత్ రాజ్ కుమార్ మరణంతో కన్నడ ప్రజలు దుఃఖంలో మునిగిపోయారు. సినీ ఇండస్ట్రీ ఓ గొప్ప నటుడిని కోల్పోయింది అంటూ చాలామంది సెలబ్రిటీస్ ఆయనకు నివాళులు అర్పించారు. అయితే ఇక తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ ట్విట్టర్ ద్వారా పునీత్ కి సంతాపం తెలిపారు. “పునీత్.. నీ మరణాన్ని నేను ఇంకా జీర్నచుకోలేకపోతున్నాను.. నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను” అంటూ పునీత్ తో పాటు కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు.
ఇక ఈ ట్వీట్ విషయంలో రజినీకాంత్ పై పునీత్ రాజ్ కుమార్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతిచెంది 12 రోజులు అవుతుంటే..నీకు ఇప్పుడు గుర్తుకు వచ్చారా అంటూ ఫైర్ అవుతున్నారు. ఇంకొంతమంది నెటిజన్స్ .. రజనీకాంత్ కూతురు సౌందర్య కొత్తగా ప్రారంభించిన హూట్ అనే యాప్ ప్రమోషన్ కోసం ఇంత నీచానికి దిగజారారు రజినీకాంత్ అంటూ మండిపడుతున్నారు. ఒక లెజెండ్ అయ్యి ఉండి మీరు కూడా ఇలాంటి పనులు చేస్తారని అనుకోలేదని..కన్నింగ్ ఫెల్లో అని కొందరు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
நீ இல்லை என்பதை என்னால் ஏற்றுக் கொள்ள முடியவில்லை புனீத்…
Rest in peace my child https://t.co/ebAa5NhJvj
— Rajinikanth (@rajinikanth) November 10, 2021