సినిమాల్లో సక్సెస్ సాధించాలంటే అంత ఈజీకాదు. వెండి తెర వెలుగుల వెనుక ఎన్నో కష్టాలు, నష్టాలు, కన్నీళ్లు ఉంటాయి. చిన్న చిన్న పాత్రలు పోషించిన వారు.. చిన్న చిన్న పనులు చేసిన వారు.. ఎంతో కష్టపడి ఉన్నత స్థాయికి చేరుకున్నారు కూడా. నటులే కాదు.. కొందరు దర్శకులు కూడా తొలుత చిన్న చిన్న క్యారెక్టర్లు చేశారు. ఆ తర్వాత మంచి సక్సెస్ కొట్టి సినిమాల్లో రాణించారు. ఇంతకీ ఓ సినిమాలో బ్యాగ్రౌండ్ ఆర్టిస్టుగా కనిపించిన వ్యక్తి.. ఆ తర్వాత జాతీయ అవార్డును అందుకున్నాడు. ఇంతకీ తను ఎవరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ప్రభాస్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా చెప్పుకునే సినిమా వర్షం. ఈ సినిమా తన కెరీర్ ను మంచి మలుపు తిప్పడానికి ఉపయోగ పడింది. ఈ సినిమాకు శోభన్ దర్శకత్వ వహించాడు. త్రిష హీరోయిన్ గా చేసింది. అప్పట్లో ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. దేవిశ్రీ ప్రసాద్ పాటలు ఈ సినిమాకు ఎంతో ఉపయోపడ్డాయి. అయితే ఈ సినిమాలో త్రిష, ప్రభాస్ బస్సులో వెళ్లే సీన్ ఉంటుంది. వారి వెనుక మూడో సీట్ లో కూర్చున్న వ్యక్తి ప్రస్తుతం టాలీవుడ్ టాప్ దర్శకుడిగా మారాడు. ఇంతకీ ఆయన ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
తను మరెవరో కాదు.. మహర్షి సినిమాకు దర్శకత్వం వహింన వంశీ పైడిపల్లి. ఈ సినిమాతో తను జాతీయ అవార్డును అందుకున్నాడు. అప్పట్లో తను వర్షం సినిమాకు అసిస్టెంట్ దర్శకుడిగా చేశాడు. అందులో భాగంగానే ఓ సీన్ లో వెనుక కనిపించాడు. వంశీ పైడిపల్లికి, ప్రభాస్ కు మంచి స్నేహం ఉంది. ప్రభాస్ సినిమా మున్నాతోనే వంశీ ఇండస్ట్రీలోకి దర్శకుడిగా అడుగు పెట్టాడు.అనంతరం బృందావనం, ఎవడు, ఊపిరి సినిమాలను తెరకెక్కించాడు. తాజా మూవీ మహర్షితో జాతీయ అవార్డు అందుకున్నాడు. ప్రస్తుతం ఆయన తమిళ హీరో దళపతి విజయ్ హీరోగా చేస్తున్న ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.