Moviesత్రివిక్రమ్ స్టార్ డైరెక్టర్ అవ్వడానికి గల కారణాలు ఇవే !

త్రివిక్రమ్ స్టార్ డైరెక్టర్ అవ్వడానికి గల కారణాలు ఇవే !

త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ స్టార్ రైటర్ 1999లో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. దాదాపు మూడేళ్ల పాటు రైటర్ గా పలు సినిమాలకు పని చేసిన ఈ మాటల మాంత్రికుడు 2002లో డైరెక్టర్ గా మారాడు. అప్పటి లవర్ బాయ్ అయిన తరుణ్ తో తన తొలి సినిమాను తెరకెక్కించాడు. నువ్వే నువ్వే పేర తీసిన ఈ సినిమా ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. ఇక అప్పటి నుంచి వెనక్కు తిరిగి చూసుకోని త్రివిక్రమ్ ఈ 20 ఏళ్లలో దాదాపు 11 సినిమాలను తెరకెక్కించాడు. ఈ 11 సినిమాలలో మెగా హీరోలతోనే ఆరు సినిమాలు చేశాడు. అంటే సగం సినిమాలన్న మాట. దీనిని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. మెగా హీరోలు త్రివిక్రమ్ తో ఏ రేంజ్ లో కనెక్ట్ అయ్యారో. ఆరు బ్లాక్ బస్టర్ సినిమాలకు రైటర్ గా పని చేసిన త్రివిక్రమ్ ఉత్తమ రచయితగా నంది అవార్డును మాత్రం అందుకోలేకపోయాడు. కానీ తాను డైరెక్టర్ గా మారి తీసిన తొలి సినిమా నువ్వే నువ్వే ద్వారా రైటర్ గా నంది అవార్డును అందుకున్నాడు.

లవర్ బాయ్ తరుణ్ ను హీరోగా పెట్టి నువ్వే నువ్వే వంటి బ్లాక్ బస్టర్ తెరకెక్కించిన మాటల మాంత్రికుడికి వెంటనే మహేశ్ రూపంలో పెద్ద ఆఫర్ వచ్చింది. నువ్వే నువ్వే సినిమాను డైరెక్ట్ చేసిన విధానానికి ఇంప్రెస్ అయిన మహేశ్ వెంటనే త్రివిక్రమ్ కు చాన్స్ ఇచ్చాడు. దీంతో ఎగిరి గంతేసిన త్రివిక్రమ్ మహేశ్ తో అతడు లాంటి బ్లాక్ బస్టర్ ను తెరకెక్కించాడు. పార్థు క్యారెక్టర్ తో టాలీవుడ్ ను మెస్మరైజ్ చేసిన త్రివిక్రమ్ ఈ సినిమకు నంది అవార్డు వచ్చేలా చేశాడు. ఈ సినిమాను ఇప్పటికీ బుల్లి తెర ప్రేక్షకులు వదలకుండా చూస్తున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు త్రివిక్రమ్ పవర్. తారక్ తో అరవింద సమేత వీర రాఘవ అంటూ తీసి బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news