ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో గయ్యాళి పాత్రలకు పెట్టింది పేరు సూర్యకాంతం. ఈమె పేరు చెప్తేనే జనాలకు ఎక్కడలేని కోపం వచ్చేది. ఆమె ఓ గయ్యాలి గంపగా జనాల మనసుల్లో నిలిచిపోయింది. నిజానికి సూర్యకాంతం చాలా కలివిడి మనిషి. తన తల్లిదండ్రులకు ఈమె 14వ సంతానం. వారి ఇల్లంతా జనాలతో నిండి ఉండేది. అందుకే ఆమె భోళాతనంతో మాట్లాడుతుంది. తను చిన్నప్పటి నుంచే చక్కగా పాటలు పాడటం, నాట్యం నేర్చుకుంది. కొంత కాలం తర్వాత నాటకాల్లోనూ అడుగు పెట్టింది. తన నటనకు జనాలు చప్పట్లు కొట్టి ప్రశంసించేవారు. ఆ తర్వాత తనకు సినిమాల్లో నటించాలనే ఆసక్తి కలిగింది. ఆమె సినిమాల్లోకి వెళ్లడం ఇంట్లో వాళ్లకు ఇష్టం లేదు. అయినా తను చెన్నైకి వెళ్లింది.
చక్కటి నటి అయినా.. ఆమె అవకాశాలు ఇవ్వలేదు సినిమా దర్శకనిర్మాతలు. సినిమాల్లో పనికిరావు అంటూ ముఖం మీదే చెప్పారు. కానీ తను అవకాశాల కోసం ప్రయత్నాలు ఆపలేదు. జెమినీ స్టూడియోలో జరుతున్న చంద్రలేఖ సినిమా ఆడిషన్స్ కు తను వెళ్లింది. కానీ నటిగా ఛాన్స్ దక్కించుకోలేదు. చిరవకు వెనక్కి తిరిగి వెళ్లిపోతుంటే మేనేజర్ భూషణం ఆమెను పిలిచాడు. డ్యాన్సర్లు తక్కువగా ఉన్నారు. చేస్తారా? అని అడిగాడు. నాకు డ్యాన్స్ రాదు అని చెప్పింది. వాళ్లందరికీ వచ్చా? అని చెప్పాడు. చివరకు తెలుగు తెరకు ఆమె డ్యాన్సర్ గా పరిచయం అయ్యింది. 1949లో వచ్చిన ధర్మాంగత సినిమాలో ఆమె మూగవేషంలో నటించింది. ఇందులో తన నటనతో ఆకట్టుకుంది. ఆ తర్వాత నారద నారది సినిమాలో సహాయనటిగా చేసింది. అద్భుత నటనతో గృహప్రవేశం సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత సంసారం సినిమాలో నటించి స్టార్ పొజిషన్ లోకి చేరింది. ఈ సినిమాలోనే తొలిసారి గయ్యాళి అత్తగా నటించింది.
సంసారం సినిమా తర్వాత సూర్యకాంతం వెనక్కి చూసుకోలేదు. ఆ తర్వాత తన కెరీర్ అంతా అదే బాటలో పయనించింది. అత్త పాత్రల్లో నటించి మెప్పించింది. తెలుగు సినిమా ప్రస్తానం ఉన్నంత కాలం తన పేరు సువర్ణ అక్షరాలతో నిలిచిపోతుంది.