Moviesకర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం..పునీత్ రాజ్ కుమార్ కు అరుదైన పురస్కారం..!!

కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం..పునీత్ రాజ్ కుమార్ కు అరుదైన పురస్కారం..!!

క‌న్న‌డ ప‌వ‌ర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హ‌ఠాన్మ‌ర‌ణాన్ని దేశ వ్యాప్తంగా సినీ అభిమానులే కాకుండా సాధార‌ణ జ‌నాలు సైతం జీర్ణించు కోలేక పోతున్నారు. కేవ‌లం 46 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు.. ఎంతో మంచి భ‌విష్య‌త్తు ఉన్న ఈ స్టార్ హీరో గుండె పోటుతో మృతి చెంద‌డం ఎంతో మంది అభిమానుల‌కు వేదన మిగిల్చింది.

ఎన్ని సంవత్సరాలు బతికామన్నది కాదు.. బ్రతికినన్నాళ్లు ఎంత మందిని మనం సంతోషపెట్టాం.. ఎంతమంది ఆప్తులను సంపాదించుకున్నామనేది ముఖ్యం. ఈ విషయంలో కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అందరికంటే ముందున్నారు. అస‌లు పునీత్ చనిపోయారంటే ఎవ్వ‌రూ న‌మ్మ‌డం లేదు. క‌న్న‌డ ప‌వ‌ర్‌స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం కోట్లాదిమంది అభిమానులను ఎంత‌లా క‌దిలించిందో మనం చూశాం.

పునీత్ 20 ఏళ్ల కెరీర్‌లో 29 సినిమాలు హీరోగా చేస్తే అందులో తొలి 11 సూప‌ర్ హిట్లే. వ‌రుస‌గా 11 హిట్లు కొట్టిన హీరోగా పునీత్ భార‌తీయ సినిమా చ‌రిత్ర‌లోనే త‌న‌కంటూ తిరుగులేని రికార్డు క్రియేట్ చేసుకున్నాడు. పునీత్ ఇంత హీరో అవ్వ‌డానికి కార‌ణం.. కేవ‌లం అత‌డు సినిమా హీరో అని మాత్ర‌మే కాదు… అత‌డి గొప్ప వ్య‌క్తిత్వ‌మే ఈ రోజు ఈ స్థాయిలో నిల‌బెట్టింది. అత‌డు సినిమాల్లో కేవ‌లం ఒక్క హీరో మాత్ర‌మే కాదు… సామాజిక సేవ ద్వారా కూడా ఎంతోమంది మ‌దిలో ఆరాధ్యుడు అయ్యాడు. అత‌డి ఫ్యామిలీకి ఎంత బ్యాగ్ గ్రౌండ్ ఉన్నా.. తాను ఎంత పెద్ద హీరో అయినా కూడా ప‌వ‌ర్ స్టార్ ఎంత అణుకువ‌గా ఉండేవాడో మ‌నం చాలా సంధర్భాల్లో చూశాం.

ఆయన చనిపోయి 10 రోజులు అవుతున్నా కూడా ఇప్పటికీ కర్ణాటకలో ఆ విషాద ఛాయలు అలాగే ఉన్నాయి. ఆయన సమాధిని దర్శించుకోవడానికి రోజుకు లక్షల్లో అభిమానులు అక్కడికి వస్తున్నారు. కేవలం 46 సంవత్సరాల వయసులోనే ఆయన గుండెపోటుతో మరణించినా కూడా.. అతడి కోసం 16 మంది గుండెలు ఆగిపోయాయంటేనే ఆయన స్థాయి మనకు అర్థమవుతుంది.

ఇదిలా ఉంటే ఆయన చనిపోయినప్పుడు ప్రభుత్వ లాంఛనాలతో ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై సమక్షంలో అంత్యక్రియలు జరిగాయి. ఇక ఇప్పుడు మరో అత్యుత్తమ పురస్కారం పునీత్ రాజ్ కుమార్ కు మరణానంతరం లభించింది. పునీత్‌ రాజ్‌కుమార్‌కు చిత్రదుర్గంలోని ప్రముఖ ధార్మిక సంస్థ శ్రీ మురుఘరాజేంద్ర మఠం 2021 సంవత్సరానికి బసవశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది.

అవార్డు కిందట రూ.5 లక్షల నగదు, జ్ఞాపిక అందజేస్తారు. బసవ జయంతి రోజున ఈ అవార్డును పునీత్‌ సతీమణి అశ్వినికి అందజేస్తామని ప్రకటించారు. బసవశ్రీ పురస్కారాలను ఇదివరకే బౌధ్ధ ధర్మ గురువు దలైలామా, ఇస్రో మాజీ అధ్యక్షుడు కస్తూరి రంగన్, పర్యావరణ ఉద్యమకారిణి వందనా శివ తదితరులు స్వీకరించిన విషయం తెలిసిందే.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news