ప్రముఖ దర్శక ధీరుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో 1996లో పెళ్లిసందడి లాంటి బ్లాక్‌బస్టర్ సినిమా వచ్చింది. ఇప్పుడు ఆ సినిమాకు కంటిన్యూ అంటూ నాటి పెళ్లిసందడి హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా పెళ్లిసందD సినిమా వచ్చింది. ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా హీరోయిన్ శ్రీలలే బాగా హైలెట్ అయ్యింది. ఈ సినిమాకు మంచి వసూళ్లు రావడానికి కూడా ప్రధాన కారణం హీరోయిన్ శ్రీలీలే. ఈ సినిమా రిలీజ్ అయ్యాక శ్రీలలకు తెలుగులో వరుస పెట్టి ఆఫర్లు క్యూ కడుతున్నాయి.
ఎన్టీఆర్ పక్కన కూడా ఆమె పేరు వినిపిస్తోంది. ఆమె తెలుగు మూలాలు ఉన్న అమ్మాయే. శ్రీలీల 2001జూలై 14వ తేదీన అమెరికాలోని డెట్రాయిట్ లో జన్మించింది. ఈమె తండ్రి పెద్ద బిజినెస్‌మేన్. తల్లి స్వర్ణలత డాక్టర్. శ్రీలీలకు శ్రీకర్, శ్రీదీప్ అనే ఇద్దరు సోదరులు కూడా ఉన్నారు. ఈమె ఫ్యామిలీ అమెరికా నుంచి బెంగళూరుకు షిఫ్ట్ అయ్యింది. తల్లి బాటలోనే డాక్టర్ అవ్వాలని ఆమె డాక్టర్ చదువుతూనే భరతనాట్యం నేర్చుకుంది.
ఆ తర్వాత మోడలింగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె కన్నడంలో కిస్ సినిమాలో నటించింది. ఆ సినిమా హిట్ అయ్యింది. ఆ తర్వాత పెళ్లిసందD సినిమాలో హీరోయిన్గా నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమా కోసం ఆమె రు. 30 లక్షల రెమ్యునరేషన్ తీసుకుందట. ప్రస్తుతం బెంగళూరులో ఖరీదైన ఇంట్లో ఉంటోన్న ఆమెకు ఇష్టమైన హీరోలు హృతిక్ రోషన్, యశ్. ఇష్టమైన హీరోయిన్ రష్మిక మందన్న.
ఆమెకు ఇష్టమైన టూరిస్ట్ స్పాట్ మాల్దీవులు. ఇదిలా ఉంటే ఆమె ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార్తె అని ఇటీవల ప్రచారం జరిగింది. దీనిపై సదరు పారిశ్రామికవేత్త ఖండించడంతో పాటు శ్రీలీల తన మాజీ భార్య కుమార్తె అని.. తాను తన మాజీ భార్యతో విడిపోయాక పుట్టిందని చెప్పిన సంగతి తెలిసిందే.