Moviesబ‌న్నీ - బోయ‌పాటి సినిమాకు అప్పుడే ఇంత డిమాండా... కేక పెట్టించే...

బ‌న్నీ – బోయ‌పాటి సినిమాకు అప్పుడే ఇంత డిమాండా… కేక పెట్టించే రేటు…!

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా త‌ర్వాత పుష్ప పార్ట్ 2 కూడా రానుంది. ఈ సినిమా త‌ర్వాత బ‌న్నీ – బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్లో మ‌రో సినిమా రానుంది. గ‌తంలో వీరిద్ద‌రి కాంబోలో వ‌చ్చిన స‌రైనోడు సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది. 2016 లో వ‌చ్చిన స‌రైనోడు బ‌న్నీకి మాస్ ఇమేజ్ రావ‌డంలో కీల‌క పాత్ర పోషించింది. ర‌కుల్‌ప్రీత్ ఈ సినిమాలో హీరోయిన్‌. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై వ‌చ్చిన స‌రైనోడు మంచి వ‌సూళ్లు రాబ‌ట్టింది.

ఇక ఇప్పుడు మ‌రోసారి బ‌న్నీతో గీతా బ్యాన‌ర్‌లోనే సినిమా చేసేందుకు బోయ‌పాటి అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. ఇప్ప‌టికే బోయ‌పాటి బ‌న్నీకి క‌థ చెప్ప‌డం.. అర‌వింద్‌, బ‌న్నీ ఓకే చెప్ప‌డం జ‌రిగిపోయాయి. పుష్ప పూర్త‌యిన వెంట‌నే ఈ సినిమా ప‌ట్టాలెక్క‌నుంది. బోయపాటి కెరీర్‌లో ప్లాప్ అయిన‌వి ద‌మ్ము, విన‌య‌విధేయ రామ. అయితే ఈ రెండు సినిమాలు కూడా మాస్ ఫ్యాన్స్‌కు న‌చ్చ‌డంతో పాటు భారీ వ‌సూళ్లు రాబ‌ట్టాయి.

ఇక ఇప్పుడు వీరి కాంబోలో వ‌చ్చే సినిమా సెట్స్ మీద‌కు వెళ్ల‌కుండానే రు. 60 కోట్ల నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ ఆఫ‌ర్ వ‌చ్చింద‌ట‌. బ‌న్నీ సినిమాలు హిందీలో డ‌బ్ చేసి వ‌దులుతుంటే యూట్యూబ్ షేక్ అవుతోంది. ఇక బ‌న్నీ క్రేజ్‌, బోయ‌పాటి మాస్ ఎలిమెంట్స్‌, గీతా బ్యాన‌ర్ పేరుతో అప్పుడే ఈ సినిమాకు ఈ రేంజ్ ఆఫ‌ర్ వ‌చ్చింద‌ని అంటున్నారు.

ప్రస్తుతం బోయపాటి .. బాలకృష్ణ అఖండ సినిమా ప‌నుల్లో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా షూటింగ్ కూడా పూర్త‌య్యింది. ఆ సినిమా ప్ర‌మోష‌న్ల త‌ర్వాత బ‌న్నీ సినిమా క‌థా చ‌ర్చ‌ల్లో బిజీ కానున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news