టాలీవుడ్లో ఆయనో స్టార్ హీరో… ఇండస్ట్రీలో ఏళ్లు గడుస్తున్నా కూడా ఆయన ఛరిష్మా తగ్గడం లేదు. ఈ వయస్సులో కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ కూడా వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. అయితే ఆయన వ్యక్తిగత జీవితం మాత్రం కాస్త ఇబ్బందుల్లోనే ఉంటోంది. ముఖ్యంగా పిల్లల విషయంలోనే ఆయన ఎక్కువుగా మానసిక వేదనకు గురవుతున్నారు. ఓ కుమార్తె తనకు ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకుంది. ఆ పెళ్లి పెద్ద రచ్చ రచ్చకు కారణమైంది. చివరకు ఆమె భర్త నుంచి విడిపోయి తిరిగి తండ్రి వద్దకే వచ్చేసింది. చివరకు ఆమె బాధ్యత తీసుకున్న సదరు స్టార్ హీరో మళ్లీ ఆమెకు పెళ్లి చేశాడు.
ఇక ఇప్పుడు మరో కుమార్తె వైవాహిక బంధం కూడా విడాకుల దిశగానే ఉంది. ఆమె కొన్నేళ్ల క్రితమే భర్త నుంచి విడిపోయి పుట్టింటికి వచ్చేసింది. ఇప్పుడు హైదరాబాద్‌లోనే ఉంటోంది. ఇక్కడే ఉంటూ తండ్రి నటిస్తోన్న సినిమాలకు కాస్ట్యూమ్ వర్క్ చూడడం.. కొన్ని షార్ట్ ఫిల్మ్‌లు ప్లాన్ చేయడం చేస్తోంది. గత నాలుగేళ్లుగా ఆ స్టార్ హీరో కనీసం ఈ కూతురు వైవాహిక బంధం అయినా నిలబెట్టాలని చేస్తోన్న ప్రయత్నాలు అన్ని విఫలమవుతున్నాయి.
చివరకు కుమార్తెను కన్వీన్స్ చేయలేనన్న నిర్ణయానికి ఆయన వచ్చేశారట. ఇక ఆమె విడాకులు తీసుకోవాలని బలంగా నిర్ణయించుకోవడంతో స్టార్ హీరో కూడా అందుకు ఓకే చెప్పారట. త్వరలోనే ఆమె విడాకులపై అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. ఇక కుమారుడి వైవాహిక బంధం విషయంలోనూ ఆ స్టార్ హీరో ఆవేదనతోనే ఉన్నారట. ఏదేమైనా ఆ స్టార్ హీరో ఈ వయస్సులో కూడా ఇంత ఛరిష్మాతో దూసుకుపోతుంటే పిల్లల ప్రవర్తన, వారి జీవితాలు సక్రమంగా లేకపోవడంతోనే ఆయన ఆవేదనతో ఉన్నారట.