దర్శకుడు రాజమౌళికి సక్సెస్ ఫార్ములాతో పాటు తన సినిమాపై దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానుల్లో ఎలా అంచనాలు పెంచాలి అనేది బాగా తెలుసు. రాజమౌళి తీస్తోన్న ప్రతి సినిమాలకు అంచనాలు డబుల్, త్రిబుల్ అయిపోతున్నాయి. తన సినిమాలపై ఉన్న అంచనాలను ఎలా క్యాష్ చేసుకోవాలో కూడా ఆయనకే బాగా తెలుసు. రాజమౌళిలో కనపడని మార్కెట్ స్ట్రాటజీ అయితే దాగి ఉంది.
ప్రస్తుతం రాజమౌళి చెక్కుతోన్న శిల్పం ఆర్ ఆర్ ఆర్ వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన థియేటర్లలోకి వస్తోంది. ఇప్పటికే రెండున్నర సంవత్సరాలుగా ప్రేక్షకులను ఊరిస్తూ ఊరిస్తూ వస్తోన్న ఈ సినిమాకు రెండు, మూడు రిలీజ్ డేట్లు వేసినా ఆ టైంకు సినిమా రాలేదు. కరోనాతో పాటు సినిమా మేకింగ్‌లో చాలా ఆలస్యం కావడం ఇందుకు కారణం.
ఇక రెండు రోజుల క్రితం వదిలిన గ్లింప్స్ కూడా మిలియన్ల వ్యూస్‌తో సోషల్ మీడియాలో తాండవం చేస్తోంది. ఈ సినిమా క్వాలిటీలో రాజీపడకుండా ఉండేందుకే రాజమౌళి ఏకంగా మూడేళ్ల టైం తీసుకున్నాడు. ఇప్పటికే బాహుబలి దెబ్బతో మైండ్ పోయిన బాలీవుడ్ వాళ్లు ఇప్పుడు ఈ సినిమాపై నెగిటివ్ ప్రచారం ప్రారంభించారు. సోషల్ మీడియాలో ఈ ప్రచారం బాగా ఎక్కువుగా ఉంది.
గ్లింప్స్‌లో విజువల్ చూస్తేనే కళ్లు చెదిరిపోతున్నాయి. దీంతో వాళ్లు డైలాగులు లేకుండా విజువల్స్ చూసుకోవాలా ? ఆర్ ఆర్ ఆర్‌లో అసలు కంటెంట్ ఉండదా ? డైలాగులు బాగోవా ? కంటెంట్ లేకుండా కేవలం విజువల్స్ చూపించి రాజమౌళి మార్కెట్ చేసుకోవాలనుకుంటున్నాడా ? అని పోస్టులు పెడుతున్నారు. ఈ చర్చంతా హిందీ సినిమా పరిశ్రమతో పాటు అక్కడ అభిమానుల్లోనే ఎక్కువుగా జరుగుతోంది.
ఈ తంతు చూస్తుంటే ఆర్ ఆర్ ఆర్ దెబ్బతో బాలీవుడ్ మరో ఐదారేళ్లు వెనక్కు వెళ్లిపోయలా ఉంది. అసలు అక్కడ ఏ సినిమా కూడా ఇప్పట్లో ఆర్ ఆర్ ఆర్‌ను అందుకునేలా లేదు. అందుకే వాళ్లు కడుపుమంటతో ఈ పని చేస్తున్నట్టే చెప్పాలి.