సమంత..అక్కినేని నాగార్జున పెద్దకొడుకు నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తరువాత సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంతూ..అవసరం ఉన్నా లేకున్నా పోస్ట్లు పెట్టుకుంటూ..నిత్యం వార్తల్లో నిలుస్తుంది. రీజన్ చెప్పకుండా విడాకులు తీసుకున్న సమంత చైతన్య..మేమొ విడిపోతున్నం అని చెప్పి సరిగ్గ నెల రోజులు కావస్తుంది. కానీ వీళ్లు ఎందుకు విడిపోయారు అనే దాని పై మాత్రం క్లారిటీ రాలేదు. వీళ్లు చెప్పలేదు.. వీళ్ల పెద్ద వాళ్లు చెప్పే సాహసం చేయలేదు.
దీంతొ జనాలు వాళ్లకు నచ్చిన్నటు ఊహించుకుంటున్నారు. కొందరు ఏమో పిల్లలు అని..కొందరు ఏమో అక్రమ సంబంధం అని..మరి కొందరు సినిమాలు అని..ఇలా నరం లేని నాలుక నాలుగు పుకార్లు పుట్టిస్తుంది. అసలు వీళ్లు ఎందుకు విడిపోయారో చెప్పే వరకు ఇలా గాసిప్స్ కి ఎండ్ కార్డ్ పడేలా లేదు. అయితే విడాకులు తరువాత ఇద్దరు ఇద్దరికి తగ్గటే వాళ్ళ కెరీర్ పై దృష్టి పెట్టారు. వరుస సినిమాలకు సైన్ చేస్తూ కెరీర్ ని స్పీడ్ అప్ చేస్తున్నారు.
అయితే సమంత మాత్రం విడాకుల తరువాత తన ఇన్స్టా లో గాటైన పోస్ట్లు పెట్టుకొస్తుంది. మొన్న ఆడపిల్లలను ఇలా పెంచండి అంటూ సలహా ఇచ్చిన ఈ అమ్మడు..తాజాగా కలపడం కంటే విడతీయడమే బెటర్ అంటూ రాసుకొచ్చింది. మూడ్ బాగా లేకపోతే బయట పడేందుకు కబోర్డులోని బట్టలన్నీ తీసి సర్దుకుంటానని చెప్పిన సమంత. ‘చిందరవందరగా ఉన్న నా డ్రెస్సింగ్ రూంను ఎంత నీట్గా చేశారో చూడండి’ అంటూ ఓ కంపెనీకి ప్రమోషన్ ఇచ్చారు. అక్కడ బెడ్ పై తన బట్టలన్ని కుప్పలు కుప్పలుగా పడేసి ఉన్నాయి. అక్కడే తన స్నేహితులతో సామ్ కూర్చుని కబుర్లు చెబుతూ కనిపించింది. కొన్నిసార్లు సర్దడం… కలపడం కంటే వదిలేయడం బెటర్ అంటూ చెప్పుకొచ్చింది సామ్.
View this post on Instagram