కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ పరిస్థితి అత్యంత విషమంగా ఉందని.. ఇంకా చెప్పాలంటే చేయి దాటిపోయిందని వస్తోన్న వార్తలు కర్నాటకలో హై ఎలెర్ట్ వాతావరణం నెలకొంది. ఆయన జిమ్‌లో వర్కవుట్స్ చేస్తూ చాతి నొప్పి ఉందని చెప్పడంతో హాస్పటల్‌కు తరలించారు. అయితే వైద్యులు మాత్రం పరిస్థితి చేయి దాటిపోయిందని చెపుతున్నారు. కర్నాటక అంతా హై ఎలెర్ట్ వాతావరణం ఉంది.
కన్నడ లెజెండ్రీ నటుడు కంఠరీవ రాజ్‌కుమార్‌కు మూడో కుమారుడే పునీత్. పునీత్ వయస్సు 46 సంవత్సరాలు. పునీత్‌ను అక్కడ కన్నడ సినీ అభిమానులు కన్నడ పవర్‌స్టార్‌గా పిలుచుకుంటారు. అభిమానులు ఎంతో ప్రేమగా అప్పూ అని పిలుచుకుంటారు.
పునీత్ 1975 మార్చి 17న జన్మించారు. పునీత్ 1976లో బాలనటుడిగా కెరీర్ ప్రారంభించి 13 సినిమాలు చేశారు. ఉత్తమ బాలనటుడిగా నేషనల్ అవార్డును కూడా గెలుచుకున్నారు. ఇక హీరోగా 2002లో అప్పూ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసి ఇప్పటి వరకు 32 సినిమాల్లో నటించాడు. ఆయన తాజా చిత్రం యువరత్న.
పునీత్, ఎన్టీఆర్ మంచి స్నేహితులు. గతంలో సీనియర్ ఎన్టీఆర్, రాజ్‌కుమార్ కూడా అంతే స్నేహంగా ఉండేవారు. ఇక రాజ్‌కుమార్ పెద్ద కుమారుడు శివరాజ్‌కుమార్ – బాలయ్య చెన్నైలో క్లాస్‌మెట్స్. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ – పునీత్ కూడా మంచి స్నేహంగా ఉండేవారు. పునీత్ కోరిక మేరకే ఆయన నటించిన ఓ సినిమాలో ఎన్టీఆర్ గెలయా గెలుపు నీదయ్యా పాట పాడారు. థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ ఇచ్చారు.