సమాజంలో రోజు ఏదో ఒక్క రాష్ట్రంలో..ఏదో ఒక్క ఊర్లో అయినా మనం వినే కామన్ వార్త..రేప్ న్యూస్. రోజుకో మంచి వార్త మనం వినికపోయినా..ఇలాంటి రేప్ న్యూస్ మాత్రం మనం ఖచ్చితంగా ఒక్కటైన వింటాం. అలా తగలాడింది మన దేశ పరిస్ధితి. ఏదో ఆ న్యూస్ బయటకి వచ్చినప్పుడు ..ర్యాలీలు..ధర్నాలు..ఆడవాళ్ళకు రక్షణ లేకుండా పోయిందంటూ అరుపులు..స్లోగన్ లు..చేయడం..మళ్లి పక్క రోజు ఏదో ఒక్క దగ్గర రేప్ జరిగింది అనే న్యూస్ బయటకు రావడం ..ఇది ప్రస్తుత ఇండియా పరిస్ధితి.
ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు చేసినప్పటికీ మహిళలపై ఈ విధమైనటువంటి దాడులు ఆగడం లేదు. సాధారణ మహిళల నుంచి సెలబ్రిటీల వరకు ఇలా ఎక్కడో ఒక చోట అత్యాచారానికి గురవుతున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీ లో బిగ్ బాస్ కంటెస్టెంట్ గా పాల్గొన్న మోడల్ షహనాజ్ తండ్రి సంతొఖ్ సింగ్ పై గతంలో అత్యాచారం కేసు నమోదైంది. ఈ విషయం అప్పట్లో హాట్ న్యూస్ గా నడిచింది. యావత్ దేశాని కదిలించింది.
బియాస్ గ్రామంలో ఉన్న తనఫ్రెండ్స్ ను కలవడం కోసం వచ్చిన స్నేహితులలో ఓ యువతి పై ఈ నీచుడు కన్నుపడింది. తనను ఎలాగైనా లొంగదీసుకోవాలని ట్రై చేసాడట..అది కుదరకపోవడంతో.. కత్తితో బెదిరించి తనపై అతి దారుణంగా అత్యాచారం చేసినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో చెప్పుకొచ్చింది. ఇక్కడ మరో షాకింగ్ విషయం ఏమిటంటే.. అత్యాచారం చేసిన చాలా రోజులకు అతనిపై ఫిర్యాదు చేయడం.
తన గురించి పోలీసులకు ఫిర్యాదు చేస్తే తనని, తన కుటుంబానికి ఏదైనా ప్రమాదం కలిగిస్తాడేమోనని బయటపడినట్లు బంధువులు చెప్పుకొస్తున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే పలువురు అతనికి తగిన శిక్ష పడాలని డిమాండ్ చేశారు. ఇలా ప్రపంచంలో ప్రతి రోజు ఏదో ఒక మూల ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కొత్త చట్టాలు మాత్రం ఏం చేయలేకపోతున్నాయి. అసలు ఈ రేప్ న్యూస్ లకి ఎప్పుడు ఎండ్ కార్డ్ పడుతుందో కూడా తెలియని పరిస్ధితి నెలకొంది.