Moviesసీనియ‌ర్ న‌టి సుధారెడ్డిని ఘోరంగా అవ‌మానించిన డైరెక్ట‌ర్‌..!

సీనియ‌ర్ న‌టి సుధారెడ్డిని ఘోరంగా అవ‌మానించిన డైరెక్ట‌ర్‌..!

సీనియ‌ర్ న‌టి సుధారెడ్డి తెలుగు సినిమా ప్రేక్ష‌కుల‌కు రెండున్న‌ర ద‌శాబ్దాల‌కు పైగా తెలుసు. ఎన్టీఆర్ మేజ‌ర్ చంద్ర‌కాంత్ సినిమాలో న‌టించిన ఆమె ఆ త‌ర్వాత చిరంజీవి గ్యాంగ్ లీడ‌ర్ సినిమాలో హీరో వ‌దిన పాత్ర‌తో మెప్పించారు. అప్ప‌టి నుంచి ఆమె అమ్మ‌, అక్క‌, అత్త‌, వ‌దిన పాత్ర‌లు వేస్తూనే ఉన్నారు. సినిమాల్లోకి వ‌చ్చిన వెంట‌నే ఆమె క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా కెరీర్ స్టార్ట్ చేయ‌డంతో ఆమె హీరోయిన్‌గా చేయ‌లేక‌పోయారు.

ఇటీవ‌ల ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంట‌ర్వ్యూలో ఆమె ఓ డైరెక్ట‌ర్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఓ సినిమా షూటింగ్‌లో డైరెక్ట‌ర్ త‌న‌ను ఇబ్బంది పెట్ట‌డంతో తాను క‌న్నీళ్లు పెట్టుకున్న‌ట్టు చెప్పారు. కోలీవుడ్ ద‌ర్శ‌కుడు సెల్వరాఘవన్ దర్శకత్వం వహించిన 7/జి బృందావన కాలని బాక్సాఫీస్ వ‌ద్ద మంచి హిట్ అయ్యింది. ఆ సినిమా షూటింగ్ జ‌రుగుతుండ‌గా… ద‌ర్శ‌కుడు సుధా రెడ్డిని మాట‌ల‌తో ఇబ్బంది పెట్టాడ‌ట‌.

దాంతో సుధ షూటింగ్ స్పాట్ నుంచి వెళ్లిపోయింద‌ట‌. అయితే అసిస్టెంట్ డైరెక్ట‌ర్లు, నిర్మాత బ‌ల‌వంతం చేయ‌డంతో ఆ సినిమాలో న‌టిచాన‌ని.. ఆ త‌ర్వాత ఇంకెప్పుడు సెల్వ రాఘ‌వ‌న్ సినిమాల్లో న‌టించ కూడ‌ద‌ని నిర్ణ‌యం తీసుకున్నాన‌ని చెప్పింది. ఇండ‌స్ట్రీలో పెద్ద‌, చిన్న అన్న తేడాలు ఉండ‌కూడ‌ద‌ని.. ఎవ‌రైనా అంద‌రితో క‌లిసి మెలిసి ఉంటేనే చ‌క్క‌టి వాతావ‌ర‌ణంలో ప‌ని చేయ‌గ‌లుగుతామ‌ని సుధ చెప్పింది.

ఆ రోజు ద‌ర్శ‌కుడు సెల్వ రాఘ‌వ‌న్ సెట్లో త‌న‌తో అన్న మాట‌లు త‌న‌కు ఇప్ప‌ట‌కీ గుర్తు ఉన్నాయ‌ని సుధ చెప్పుకు వ‌చ్చింది. తాను కేవ‌లం రెమ్యున‌రేష‌న్ కోస‌మే సినిమాల్లో న‌టించ‌ను అని.. ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల‌తో త‌న‌కు రిలేష‌న్ కూడా ముఖ్య‌మే అని చెప్పింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news