Moviesనాకు పెళ్లి చేసుకోవాలని ఉంది..కానీ..అమ్మో అమ్మడు మంచి స్పీడ్ మీదే ఉందే..!!

నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది..కానీ..అమ్మో అమ్మడు మంచి స్పీడ్ మీదే ఉందే..!!

గోవా బ్యూటీ ఇలియానా అంద‌చందాల గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయ‌న‌క్క‌ర్లేదు. దేవ‌దాస్ సినిమాతో తెలుగు సినిమాకు హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయిన ఇలియానా ఆ త‌ర్వాత రెండో సినిమా పోకిరీతోనే తెలుగులో తిరుగులేని స్టార్ డ‌మ్ తెచ్చుకుంది. ఆ టైంలో ఇలియానాతో సినిమాలు చేసేందుకు టాలీవుడ్ టాప్ హీరోలు, ద‌ర్శ‌కులు వెంట ప‌డేవారు. దేవుడు చేసిన మ‌నుషులు సినిమా త‌ర్వాత ఆమె బాలీవుడ్‌కు చెక్కేసింది. ఇక్క‌డ స్టార్ డ‌మ్ ఉండ‌గానే దానిని వ‌దులుకుని బాలీవుడ్‌కు వెళ్లిన ఇలియానాకు అక్క‌డ హిట్లు లేవు.

ఆ త‌ర్వాత ఆమె చేసిన త‌ప్పు తెలుసుకుని తిరిగి టాలీవుడ్‌లో ఛాన్సుల కోసం ట్రై చేసినా అప్ప‌టికే ఇక్క‌డ అనుష్క, న‌య‌న‌తార‌, ర‌కుల్ లాంటి క్రేజీ హీరోయిన్లు పాతుకు పోవ‌డంతో ఇలియానాను ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేదు. చివ‌ర‌గా ఆమె ర‌వితేజ ప‌క్క‌న అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ సినిమా చేసింది. ఈ సినిమా కూడా ప్లాప్ అయ్యింది. ఈ సినిమాలో ఇలియానా లుక్ చూసిన వారు తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు చేశారు. ఈ అమ్మ‌డు ఒక‌ప్పుడు టాలీవుడ్ లో వ‌రుస సినిమాలు చేస్తూ తెగ సంద‌డి చేసింది.

మోడల్‌గా ఫేమస్ అయిన టైంలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది ఇలియానా. ఆరంభంలోనే అద్భుతమైన నటనతో పాటు అందంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ వరుస అవకాశాలు అందుకొని స్టార్ హీరోయిన్‌గా అవతారమెత్తింది. 35 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న ఇలియానా ఆ మ‌ధ్య గర్భవతి కూడా అని ఓ వార్త తెగ వైరల్ అయింది. తన బాయ్ ఫ్రెండ్ తో ఇలియానా రహస్య వివాహం చేసుకుందని.. దాని ఫలితంగా ఆమె గర్భం కూడా దాల్చింది అని పుకార్లు హల్ చల్ చేసాయి. అయితే తాజాగా ఓ నెటిజ‌న్ కి సమాఢానమిస్తూ ఇలియానా పెళ్లి పై ఇంట్రెస్టింగ్ కామెంత్స్ చేసింది. పెళ్లి ఆలోచన ఉంది.. కానీ వరుడు దొరకాలిగా అంటూ రిప్లై ఇచ్చింది. దీని బట్టి చూస్తే గోవా బ్యూటీ ఇలియానాకి క‌రెక్ట్ ప‌ర్స‌న్ దొరికితే త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లు ఎక్క‌నుంద‌నేగా..!!

Latest news