Moviesబాల‌కృష్ణ షోకి వ‌చ్చే ఫస్ట్ గెస్ట్ ఆయనే..మ్యాటర్ తెలిసిపోయిందోచ్..!!

బాల‌కృష్ణ షోకి వ‌చ్చే ఫస్ట్ గెస్ట్ ఆయనే..మ్యాటర్ తెలిసిపోయిందోచ్..!!

బాలకృష్ణ మొదటిసారి ప్రత్యేకంగా ఒక టాక్ షోకు హోస్టింగ్ చేసేందుకు సిద్ధమయిన విషయం తెలిసిందే. అన్‌స్టాపబుల్ షో ద్వారా సరికొత్తగా ఎంట్రీ ఇవ్వబోతున్న బాలయ్య ఇటీవల ఒక ఈవెంట్ ద్వారా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. బాలకృష్ణ హోస్ట్‌గా పరిచయం కానున్నారు అన్న వార్త బయటికి వచ్చినప్పటి నుండి కేవలం ఆయన ఫ్యాన్స్ మాత్రమే కాదు దాదాపు అందరు ప్రేక్షకులు ఆయన హోస్టింగ్ ఎలా ఉంటుందో చూద్దామనే ఎదురుచూస్తున్నారు.

ఈ షో నవంబర్ 4 నుండి ప్రసారం కానుంది. అయితే ఈ షోకి వ‌చ్చే తొలి గెస్ట్ ఎవ‌వరు వస్తున్నారు అన్న చర్చ సాగింది. అయితే ఇప్పుడు ఆ షోలో పాల్గొనే తొలి గెస్ట్ ఎవరు అన్న న్యూస్ బయటికొచ్చింది. తాజాగా మరో వార్త ఆయన టాక్ షో ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’పై మరిన్ని అంచనాలను పెంచేస్తోంది. ఇక అన్‌స్టాపబుల్ షోలో మొదట కలెక్షన్ కింగ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు ప్రత్యేక అతిథిగా పాల్గొన్నబోతున్నట్లు తెలుస్తోంది. ఆహా అన్ స్టాపబుల్ సెట్ లో బాలయ్యతో కలిసి మోహన్ బాబు ఫొటోలకు ఫోజులు ఇచ్చాడు. ఆ ఫొటోలు లీక్ అయ్యాయి. దీంతో మోహ‌న్ బాబుతో బాల‌కృష్ణ సంద‌డి చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.

మ‌రో రెండు మూడు రోజుల‌లో టీజ‌ర్ విడుద‌ల చేసి అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించ‌నున్నార‌ని తెలుస్తుంది. అయితే బాలకృష్ణ, మోహన్ బాబులు ఇద్దరు ఇలాంటి టాక్ షోల్లో కనిపించడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. సెలబ్రిటీలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా కూల్ గా అనే ప్రశ్నలను అడగడానికి నందమూరి బాలయ్య సిద్ధంగా ఉన్నారట. ఇప్పటికే కొన్ని ఎపిసోడ్స్ ను కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news