విప్లవ సినిమాల దర్శకుడు ఆర్. నారాయణ మూర్తి నిర్మించిన ఎర్రసైన్యం సినిమాతో బాలనటిగా వెండితెరకు పరిచయం అయ్యింది ఉదయభాను. ఆ తర్వాత యాంకర్‌గా బుల్లితెరపై ఆమె క్రియేట్ చేసిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. యాంకర్‌గా ఆమె జీ తెలుగు – స్టార్ మా – జెమినీ టీవీ ఇలా ఎన్నో టాప్ ఛానెల్స్‌లో దశాబ్ద కాలానికి పైగా ఏకచక్రాధిపత్యంగా ఓ వెలుగు వెలిగింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఇద్దరు కవల పిల్లలకు తల్లి అయిన ఆమె దూకుడు గతంతో పోలిస్తే తగ్గింది.
ఉదయభాను గతంలో పలు సినిమాల్లో ఐటెం సాంగ్స్‌లో కూడా చేసింది. ఇక ఉదయ భాను నాన్న చిన్నప్పుడే చనిపోతే ఆమె తల్లి రెండో పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత ఉదయభాను నరకం చూడడం జరిగినట్టు ఆమె పలు సందర్భాల్లో చెప్పుకు వచ్చారు. ఈ క్రమంలోనే ఉదయభానకు చిన్న వయస్సులోనే పెళ్లి చేసేశారట. ఆ పెళ్లి ఆమెకు ఇష్టం లేకపోయినా వయస్సులో తనకన్నా పెద్ద వ్యక్తితో పెళ్లి చేయడంతో అతడు ఆమెకు నరకం చూపించాడట.
చివరకు అతడు పెట్టే ఆ బాధలు భరించలేక ఆమె విడాకులు ఇచ్చేసింది. ఆ తర్వాత విజయ్‌కుమార్ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. అప్పట్లో ఉదయభాను కమెడియన్ వేణుమాధవ్ తో కలిసి డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ప్రోగ్రామ్ చేసింది. ఈ షోకు అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, ప్రభుదేవా గెస్టులుగా వచ్చారు. ఇక ఇప్పుడు కాస్త ఫ్రీ అవ్వడంతో ఉదయభాను మళ్లీ బుల్లితెర, వెండితెరపై యాక్టివ్ అయ్యే ప్రయత్నాల్లో ఉంది.