Moviesతప్పు చేశా..ఆ విషయంలో సరిదిద్దుకోలేని తప్పు చేసాను..సాయి పల్లవి సంచలన కామెంట్స్..!!

తప్పు చేశా..ఆ విషయంలో సరిదిద్దుకోలేని తప్పు చేసాను..సాయి పల్లవి సంచలన కామెంట్స్..!!

ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమై.. తొలి సినిమాతోనే ప్రేక్షకుల మనసులు దోచుకున్న బ్యూటీ సాయి పల్లవి. ఈమెకు డ్యాన్సు అంటే చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉండేది. ఈమె చిన్నప్పటి నుండి బెరుకు లేకుండా వేదికల మీద నాట్యం చేసేది. తెలుగు టెలివిజన్ డ్యాన్సు కార్యక్రమాల్లో పాల్గొనింది. సాయిపల్లవి ప్రేమమ్ చిత్రంతో ఒక్కసారిగా సౌత్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. ప్రేమమ్ తెచ్చిన క్రేజ్ తో తెలుగులో ఫిదా చిత్రంలో నటించే అవకాశాన్ని అందుకుంది.

సాయి పల్లవి .. హీరోయిన్స్ గ్లామర్స్ రోల్స్ కే కాదు ..కంటెంట్ ఉన్న రోల్స్ చేసి హిట్ కొట్టి..అభిమానులను సంపాదించుకోవచ్చు అని ప్రూవ్ చేసిన నటి. ఈ మలయాళి బ్యూటీ..ఎక్స్పోజింగ్ కు ఆమడ దూరంలో ఉంటుందన్న విషయం తెలిసిందే. నటనకు స్కోప్ ఉన్న పాత్రలనూ చూస్ చేసుకుంటూ.. వరుస హిట్ లతో దూసుకుపోతున్న సాయి పల్లవి ఖాతలో లవ్ స్టోరీ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.

ఇకపోతే తాజాగా సినీ ఇండస్ట్రీపై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది. ఈమె సినీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తన గ్లామర్ విషయంలో ఎన్నో భయాలు ఉండేవట.. ముఖ్యంగా సినిమాల్లో నార్మల్ లుక్ లో సింపుల్ గా కనిపించడానికి ఎక్కువగా ఇష్టపడతాను అని చెప్పింది. సాధారణంగా హీరోయిన్స్ ఫేస్ పైన మచ్చలు లేకుండా చక్కగా అందంగా కనిపిస్తారని..

కానీ తనకు ముఖం మీద ఎక్కువగా మచ్చలు , పింపుల్స్ ఉండేవని ..ఇక ఈ విషయంలో ఎన్నోసార్లు మానసికంగా చాలా బాధపడేదాన్ని చెప్పుతూ..నన్ను చూసి కామెంట్స్ వస్తాయేమో అని భయపడేదాన్ని అని తెలిపింది. ప్రేమమ్ సినిమా విడుదలైన తర్వాత..నేను తప్పుగా ఆలోచించానని..ఆ విషయంలో తప్పుచేసానని చెప్పుకొచ్చింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news