దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో యంగ్‌టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోలగా వస్తోన్న భారీ మల్టీస్టారర్ మూవీ ఆర్ ఆర్ ఆర్. రు. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో వస్తోన్న ఈ సినిమా షూటింగ్ గత రెండు సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. కరోనా కారణంగా ఇప్పటికే పలుసార్లు రిలీజ్ డేట్ ఎనౌన్స్ అయ్యాక కూడా వాయిదా పడింది. అయితే ఎట్టకేలకు వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 7న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
ఇక ఈ సినిమా రన్ టైం గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఆర్ ఆర్ ఆర్‌ను 180 నిమిషాల రన్ టైంతో సెట్ చేస్తున్నారట. 3 గంటల సినిమా అంటే చాలా పెద్ద సినిమాయే అని చెప్పాలి. కథలో ఏ మాత్రం ల్యాగ్ ఉన్నా ప్రేక్షకుడు బోర్ ఫీలవుతాడనే అంటున్నారు. ముందుగా బాహుబలి సినిమాను సైతం ఒకే పార్ట్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని అనుకున్నారు. తర్వాత రన్ టైం ఎక్కువవుతుందని.. కథను ఒకే పార్ట్‌లో చెప్పడం కష్టమనే చివరకు రెండు పార్టులుగా తీసుకు వచ్చారు.
అయితే ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ విషయంలో మాత్రం రాజమౌళి రన్ టైం ఎక్కువ అయినా ఈ సారి ఒకే పార్ట్‌గా రిలీజ్ చేస్తున్నారు. మరి మూడు గంటల సినిమాను చూసేందుకు రాజమౌళి ఎంతలా ఎంగేజ్ చేస్తాడో ? చూడాలి.