Movies"I Love You" అంటూ వెంట పడిన ఛార్మీ.."ఛీ పో" అంటూ...

“I Love You” అంటూ వెంట పడిన ఛార్మీ..”ఛీ పో” అంటూ రిజెక్ట్ చేసిన ఆ అబ్బాయి ఎవరో తెలుసా..?

ఛార్మీకౌర్ ..ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన నటనతో..అందంతో..కుర్రకారుకి నిద్ర పట్టకుండా చేసిన బ్యూటీ. 2002లో వ‌చ్చిన నీతోడు కావాలి అనే సినిమాతో సిల్వ‌ర్ స్క్రీన్‌పై ఏంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు..తక్కువ టైంలోనే ..అందనంత ఎత్తుకు ఎదిగిపోయింది. వరుస సినిమాలకు సైన్ చేస్తూ.. తెలుగులో టాప్ హీరోలు అయిన వెంక‌టేశ్‌, నాగార్జున, ప్ర‌భాస్‌, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల‌తో జోడి కట్టింది.

ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో న‌టించి లీడింగ్ హీరోయిన్‌గా కొన‌సాగింది. 2015లో లీడ్ రోల్‌లో వ‌చ్చిన జ్యోతిల‌క్ష్మి చిత్రంతో చివ‌రి సారిగా హీరోయిన్‌గా మెరిసింది ఛార్మీ. ఆ త‌ర్వాత పూరీ జ‌గ‌న్నాథ్ తో క‌లిసి నిర్మాత‌గా బిజీ అయిపోయింది. ప్ర‌స్తుతం పూరీజ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తోన్న లైగ‌ర్ సినిమాకు వ‌న్ ఆఫ్ ది ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది ఛార్మీ. ఈ భామ మ‌ళ్లీ మేక‌ప్ వేసుకుంటుందా..? లేదనే అంటున్నారు సినీ పెద్దలు. అయితే ఈమెకు సమబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది.


ఛార్మీకౌర్..ఓ అబ్బాయిని గాఢంగా ప్రేమించిందంట. స్కూల్లో చదువుకునే రోజుల్లోనే ఆ అబ్బాయితో పీకలోతు ప్రేమలో మునిగిందట..ఈ విషయాని సదరు అబ్బాయికి కూడా చెప్పిందట. ఐ లవ్ యూ అని ఎన్ని సార్లు చెప్పినా..అబ్బాయి తనని పట్టించుకోలేదట. ఛీ ఫొ అంటూ ఛీప్ గా మాట్లాడేవారట. ఇక విసిగిపోయిన ఛార్మీ..తన పని తాను చేసుకుంటూ.. సినిమాలో కి ఎంటర్ అయ్యిందట. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆమెనే తెలిపింది. ఇక అబ్బాయి పేరు మాత్రం చెప్పలేదు. ఇక 40 కి చేరువ అవుతున్న ఈ బ్యూటీ మాత్రం పెళ్లి మాట ఎత్తితే కస్సు మంటుంది. ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందో అని అభిమానులు కూడా ఆశగా ఎదురుచూస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news