నాగ చైతన్య-సమంత .. వాళ్ళ అభిమానులకి ఒక్కసారిగా ఊహించని షాక్ ఇచ్చింది ఈ జంట. నిప్పు లేనిదే పొగ రాదు..అన్నట్లుగా..మీడియాలో వచ్చిన మాటలనే నిజం చేస్తూ..గుండె పగిలె వార్తను చాలా సింపుల్ గా..కూల్ గా ఓ పోస్ట్ పెట్టి తమ 4 ఏళ్ళ వివాహ బంధానికి ఎండ్ కార్డ్ వేసేసారు. అప్పటి నుండి ఎంతో ముచ్చట గా ఉన్న ఈ జంట ఎందుకు విడాకులు తీసుకుంటున్నారు అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు.
నాగచైతన్య-సమంత విడాకుల విషయంలో చాలా రకాల పుకార్లు, ఊహాగానాలు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలు యూబ్యూట్ ఛానళ్లతోపాటు సోషల్‌మీడియాలో తప్పుడు వార్తలు రావడంతో సమంత కూకట్‌పల్లి కోర్టు ను ఆశ్రయించింది. తన పరువుకు నష్టం కలిగించిన సుమన్ టీవీ, తెలుగు పాపులర్ టీవీ, మరో ఛానల్‌తోపాటు సీఎల్ వెంకట్రావ్ అనే న్యాయవాదిపై సమంత పరువు నష్టం దావా వేసింది. తనపై సోషల్ మీడియాలో తన పరువుకు నష్టం వాటిల్లే విధంగా వివరించిన మూడు యూట్యూబ్ ఛానల్ పై కూకట్పల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు సమంత.
కాగా, బుధవారం సమంత తరపున హైకోర్టు న్యాయవాది బాలాజీ వాదనలు వినిపించనున్నారు. విడాకుల తరువాత సమంత తెలుగు, తమిళ భాషల్లో రెండు సినిమాలు నటిస్తున్నారు. ఇకపోతే ఈమెకు తన పరసనల్ స్టలిష్ట్ ప్రీతం తో ఎఫైర్ ఉందని..అందుకే విడాకులు తీసుకుందని సోషల్ మీడియాలో పెద్ద చర్చ కొనసాగుతున్న క్రమంలో..ప్రీతం రియాక్ట్ అవుతూ..మేమొ అక్క తమ్ముళ్ల లాంటి వాళ్లం..దయ చేసి మా మధ్య అలాంటి అక్రమ సంబంధం అంట కట్టకంది అంటూ ఫైర్ అయ్యారు.