Moviesగాత్ర మాధుర్యానికి అరుదైన గౌరవం..!!

గాత్ర మాధుర్యానికి అరుదైన గౌరవం..!!

చిత్ర.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. స్వరంలో అమృతాన్ని నింపుకుని కొన్ని వేల పాటలకు గాత్రదానం చేసిన లెజెండరీ సింగర్. అయితే ఆమె పాటలతో ఎంత మైమరిపిస్తుందో.. మాటలతో కూడా అంతే మాయ చేస్తుంది. గాయని చిత్ర 1963లో జూలై 27న కేరళలోని తిరువనంతపురంలో జన్మించారు. మాతృభాష మలయాళంలో గాయనిగా గుర్తింపు పొందిన చిత్ర ఆ తర్వాత ఇళయరాజా సంగీతంలో యావత్ దక్షిణాదినీ అలరించింది.

1986లో ‘సింధుభైరవి’ తమిళ చిత్రం ద్వారా జాతీయ స్థాయిలో ఉత్తమగాయనిగా అవార్డు దక్కించుకున్నారు. ఆ తరువాత వరుసగా మళయాళ చిత్రం ‘నఖశతంగల్’, హిందీ చిత్రం ‘విరాసత్’ ద్వారానూ గాయనిగా జాతీయ స్థాయిలో అవార్డులు అందుకొని ‘హ్యాట్రిక్’ సాధించారు. ఇప్పటి వరకు ఆరు సార్లు ఉత్తమ గాయనిగా జాతీయ అవార్డులను చిత్ర అందుకున్నారు. మూడు దశాబ్దాల కాలంలో ఆమె ఇరవై వేలకు పైగా పాటలు పాడారు. చిత్ర అసలు పేరు చిత్రా కృష్ణన్ నాయర్. చిత్రకు “దక్షిణ భారత నైటింగేల్” అనే పేరుంది.

ఇప్పటి దాకా మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, ఒరియా, హిందీ, అస్సామీ బెంగాలీ భాషలలో వేలాది పాటలు పాడింది. తాజాగా యుఏఈ గోల్డెన్ వీసా దక్కించుకున్నారు చిత్ర. యూఏఈ గోల్డెన్‌ వీసా అందుకున్నట్టు స్వయంగా చిత్ర సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. బుధవారం ఉదయం దుబాయ్ ఇమ్మిగ్రేషన్ చీఫ్ హెచ్‌ఇ మేజర్ జనరల్ మహ్మద్ అహ్మద్ అల్ మారి చేతుల మీదుగా యుఎఇ గోల్డెన్ వీసా అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ ఆమె ట్వీట్‌ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోను షేర్‌ చేశారు.

So pleased honoured & privileged to receive the UAE Golden Visa from H.E.Major General Mohammad Ahmed Al Maari the chief of Dubai immigration today morning. pic.twitter.com/a1fPYv5Ncn

— K S Chithra (@KSChithra) October 20, 2021

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news