Movies"నాకు భయం వేస్తోంది.. ఎవరు చెప్పినా కూడా నేను కన్నెత్తి చూడను".....

“నాకు భయం వేస్తోంది.. ఎవరు చెప్పినా కూడా నేను కన్నెత్తి చూడను”.. సమంత షాకింగ్ పోస్ట్..!!

సమంత నాగచైతన్య విడిపోయిన తరువాత కూడా మీడియాలో హాట్ టాపిక్ గా కనిపిస్తున్నారు. వాళ్ల నాలుగేళ్ల వివాహ బంధానికి ఎండ్ కార్డ్ వేసిన ఈ జంటా..ఆ తరువాత సోషల్ మీడియాలో ఎన్ని రూమర్స్ వచ్చినప్పటికి..అవి ఏమి పట్టించుకోకుండా..వాళ్ల పనుల్లో బిజీ అయిపోయారు. నాగ చైతన్య ఇంటికి దూరంగా ఓ ఫ్లాట్ తీసుకుని అక్కడే ఉంటూ తదుపరి సినిమాల పై ఫోకస్ పెట్టారు.

ఇక సమంత కూడా విడాకుల విషయం నుండి భయటపడడానికి వరుస సినిమాలకు సైన్ చేస్తూ.. కెరీర్ ని స్పీడ్ అప్ చేసుకుంటుంది. అయితే విడాకుల తరువాత సమంత సినిమాలు చేయడానికి కొన్ని కండీషన్స్ పెట్టింది. షూటింగ్ హైదరబాద్ లో ఉండకుండా ఉండేలా చూసుకుంటుందట. ఒక్కవేళ షూటింగ్ హైదరబాద్ లో ఉంటే ఇన్ డోర్ షూటింగ్ లు ఉండేలా చూసుకుంటుందట. అయితే ఇప్పుడు తాజాగా సమంత పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న సమంత .. తాజాగా ఈరోజు ఉదయంఇన్‏స్టా స్టోరీలో ఆసక్తికరమై ట్వీట్ చేసింది. “స్నేహ దేషు.. నా మీద నీకు ఇంత ఆధీనం ఎలా వచ్చింది. నీవు ఇక్కడ లేకపోయినా కూడా భయం వేస్తోంది. ఎవరు చెప్పినా కూడా నేను 30 కిలోల డంబెల్ వైపు కన్నెత్తి చూడను. కానీ నీ వల్ల చేయాల్సి వస్తుంది. ఆ డంబెల్ వైపు చూడండి. నాలో సగం బరువు ఉంటుంది” అంటూ తన డంబెల్ ఎత్తుతూ వర్కౌట్ చేస్తు్న్న విడీయోను షేర్ చేసింది. స్నేహ దేషు.. సమంత జిమ్ ట్రైనర్. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news