Newsఆగిపోయిన చిరంజీవి సినిమా షూటింగ్..ఆందోళనలో అభిమానులు..!!

ఆగిపోయిన చిరంజీవి సినిమా షూటింగ్..ఆందోళనలో అభిమానులు..!!

యస్..తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..చిరంజీవి ఎన్నో భారీ అంచనాలు పెట్టుకుని రీమేక్ చేస్తున్న సినిమా దాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ ఆగిపోయిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం .. ఆయన కుడి చేతికి బలమైన గాయం అవ్వడం అని తెలుస్తుంది. కరోనా మహమ్మారి విజృంభించి తెలుగు రాష్ట్ర ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్న సమయంలో ఆక్సిజన్ బ్యాంకు ద్వారా సేవలు అందించిన మెగా అభిమానులతో మెగాస్టార్ చిరంజీవి భేటీ అయ్యారు.

ఈ సమావేశానికి ఆయన కుడి చేతికి కట్టుతో హాజరు కావడంతో అభిమానులు అందోళన చెందారు. ఇక ఈ విషయమై చిరంజీవి క్లారిటీ ఇస్తూ..ఎవరు ఆందోళనల చెందకండి అని.. చేతికి చిన్నపాటి సర్జరీ జరిగింది అంతే అని..ప్రస్తుతం నేను బాగున్నానని చెప్పుతూ.. కుడి చేతితో ఏదైనా పనిచేస్తున్నప్పుడు నొప్పిగా, తిమ్మిరిగా అనిపించడంతో డాక్టర్ దగ్గరకు వెళ్లితే.. కుడిచేతి మణికట్టు దగ్గరలో ఉన్న మీడియన్‌ నర్వ్‌పై ఒత్తిడి పడటమే నొప్పికి కారణమని వైద్యులు తేల్చారు. దీనిని కార్పల్‌ టన్నెల్‌ సిండ్రోమ్‌ అంటారని ..దీంతో మైనర్ సర్జరీ చేసారని చెప్పుకొచ్చారు.

ఇక మెగాస్టార్ చిరంజీవి చేతికి సర్జరీ చేయించుకోవడం కారణంగా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న గాడ్ ఫాదర్ సినిమా కి గ్యాప్ ఇచ్చానని చిరు అధికారికంగా తెలియజేసాడు. చేయాల్సిన ఫైట్ సీక్వెన్స్ పూర్తి చేసి ఈ 15 రోజులు గ్యాప్ తీసుకుంటున్నాని..మళ్లి నవంబర్ నుంచి గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ లో పాల్గొంటానని ఆయన పేర్కొన్నారు. చిరంజీవి నేను బాగున్నాను అని చెప్పుతున్న అభిమానులు మాత్రం ఆయన ఆరోగ్యం పై టెన్షన్ పడుతున్నారు.ఆయన త్వరగా కోళుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నారు. సోషల్ మీడియాలో ట్వీట్స్ పెడుతున్నారు

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news