Moviesశ్రీవారిని సన్నిధిలో మంచు విష్ణు సంచలన కామెంట్స్..రియాక్షన్ ఎలా ఉంటుందో..??

శ్రీవారిని సన్నిధిలో మంచు విష్ణు సంచలన కామెంట్స్..రియాక్షన్ ఎలా ఉంటుందో..??

మూవీ ఆర్టిస్ట్ అసొసియేషన్ ఎన్నికల్లో విజయ డంఖా మోగించిన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమారుడు మంచి విష్ణు..ఆయన తండ్రితో కలిసి నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇటీవల మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) అధ్యక్షుడు బాధ్యతలు చేపట్టిన విష్ణు శ్రీవారి ఆశీస్సుల కోసం తన ప్యానల్‌ సభ్యులతో కలిసి సోమవారం తిరుమల వచ్చారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంచు విష్ణుకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేసారు. ‘మా’ ఎన్నికల్లో గెలిచినందుకు స్వామి వారి ఆశీస్సుల కోసం వచ్చామన్న ఆయన.. ఇప్పటి వరకు మా సభ్యులు కొందరు రాజీనామా చేసిన విషయం గురించి తమకు అసలు తెలియదని చెప్పుతూ..ఈ విషయాని మీడియా ద్వారానే వింటున్నామని.. వారి రాజీనామా లేఖలు ఇప్పటి వరకు తమకు అందలేనది వెల్లడించారు. అంతేకాదు.. తనకు ప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యులు రాజీనామా లేఖలు వస్తే అప్పుడు ఆ విషయం గురించి మాట్లాడుతానని..గుడిలో లేనిపోని కాంట్రవర్సీ మాటలు నేన్ము మాట్లాడలేని అని అన్నారు.

దీంతో ఇప్పుడు ఈ ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. అసలు ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు ఇప్పటి వరకూ ఎవరు రాజీనామా చేయలేదా..?? మరి..ఎమదుకు హడావిడి గా ప్రేస్ మీట్ లు పెట్టి..నానాహంగామా చేసారు అంటూ ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పుడు చూడాలి రాజీనామాల విషయంపై ప్రకాష్ రాజ్ అండ్ ప్యానల్ సభ్యులు ఏం చెబుతారో..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news