మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మంచు విష్ణు శనివారం ప్రమాణస్వీకారం చేశారు. ఈ నెల 10న మా జరిగిన ఎన్నికల్లో మంచు విష్ణు ప్రకాశ్ రాజ్‌పై 107 ఓట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. మంచు విష్ణు, ఆయన ప్యానెల్ సభ్యుల చేత మా ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ ప్రమాణస్వీకారం చేయించారు. ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్లో నిర్వహించిన ఈ వేడుకకు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మోహన్ బాబు, నరేశ్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
మంచు విష్ణుతో పాటు తన ప్యానెల్‌కు చెందిన సభ్యులంతా ప్రమాణస్వీకారం చేశారు. ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌కు చెందిన వారు మాత్రం గైర్హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన సీనియర్ నటుడు మోహన్ బాబు ఘటైన వ్యాఖ్యలు చేస్సరు. ” పదే పదే రెచ్చగొడితే చూస్తూ కూర్చొలేం. టీవీలకు ఎక్కడం ఇకనైనా మానేయండి. అందరం కలిసి పనిచేద్దాం. ఇది రాజకీయ వేదిక కాదు.. కళాకారుల వేదిక. మనమంతా ఒకే తల్లిబిడ్డలం..” అని మోహన్ బాబు అన్నారు. కాగా చిరంజీవి , నాగార్జున , వెంకటేష్ వంటి సీనియర్లు ఈ ఫంక్షన్ కు దూరంగా ఉన్నారు.
మంచు విష్ణు ప్యానెల్ నుంచి మొత్తం 15 మంది గెలిచారు. వారి వివరాలు..అధ్యక్షుడిగా విష్ణు, జనరల్ సెక్రటరీగా రఘుబాబు, జాయింట్ సెక్రటరీగా గౌతంరాజు, వైస్ ప్రెసిడెంట్‌గా మాదాల రవి, ట్రెజరర్‌గా శివబాలాజీ ,ఈసీ మెంబర్స్‌గా గీతాసింగ్, అశోక్ కుమార్, శ్రీలక్ష్మి, సి.మాణిక్, శ్రీనివాసులు, హరనాథ్‌బాబు, శివన్నారాయణ, సంపూర్ణేష్‌బాబు, శశాంక్, బొప్పన విష్ణు విజయం సాధించారు. వీళ్లంతా ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు..