శ్రీయ సరన్..ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగులో ఇష్టం చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయిన శ్రియ శరణ్ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించింది. తెలుగుతో పాటుగా, తమిళ, హింది చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. శ్రియ శరణ్.. కుర్ర హీరోయిన్లతో సమానంగా అందాలను ఆరబోస్తోన్న సీనియర్ హీరోయిన్. వెండితెరపై తనకంటూ ప్రత్యకత తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ చూడడానికి అమాయకంగా కనిపిస్తూ అభిమానుల మనసులను తన అందచందాలతో కొల్లగొడుతూనే ఉంది.
టాలీవుడ్లో సుదీర్ఘ కాలం హీరోయిన్గా నటించిన శ్రీయ .. రష్యన్ క్రీడాకారుడు, బిజినెస్ మ్యాన్ ఆండ్రీ కోషీవ్‌ని వివాహమాడిన విషయం తెలిసిందే.. భర్త తో పాటు అక్కడే సెట్టిల్ అయింది. పెళ్ళి తర్వాత కూడా ఈమె అందాల ఆరబోతతో పిచ్చెక్కిస్తూనే ఉంది. ఆమె తన భర్తతో ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ విదేశీ ట్రిప్పులు వేస్తోంది.వీరిద్దరు సోషల్ మీడియా లో తమ హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ నిత్యం అభిమానులతో టచ్ లో ఉంటారు. అయితే రీసెంట్ గా ఆమె ఓ షాకింగ్ స్వీట్ న్యూస్ చెప్పింది.
హీరోయిన్ శ్రియ సరన్ అతి పెద్ద సీక్రెట్‌ను రివీల్ చేసింది. గతేడాది తాను పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు చెప్పి అందరికి షాకిచ్చింది. “2020వ సంవత్సరం మొత్తం ప్రపంచం చాలా కష్టపెట్టింది. మాయదారి మహమారి కరోనా కారణంగా అందరూ ఎన్నో ప్రాబ్లంస్ ఫేస్ చేసారు. ఆ ఏడాది మొత్తం అందరూ క్వారెంటైన్‌లోనే ఉండిపోవాల్సిన పరిస్ధితి ఏర్పడింది. కానీ మా జీవితంలో మాత్రం అద్భుతం జరిగింది. చిన్నారి రాకతో మా ప్రపంచమే మారిపోయింది. మాకొక ఏంజిల్‌ని ఇచ్చినందుకు ఆ దేవుడికి ఎంతో రుణపడి ఉంటాను” అంటూ శ్రియ గుడ్ న్యూస్‌ను షేర్ చేసింది.